OTTలోకి నెలకాకముందే తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ... ఎందులో చూడాలంటే?
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఓటీటీలోకి మరో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ రాబోతుంది. అదేంటో కాదు.. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన అపరేషన్ వాలంటైన్. ఈ సినిమా రిలీజై నెలకాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ హీరో ఆ తర్వాత కంచె, ఫిదా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద ఈ హీరోకు సరైనా హిట్ పడటం లేదనే చెప్పాలి. గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్ ఇటీవల బాక్సాఫీస్ వద్దకు వచ్చింది.

పెళ్లి తర్వాత చేసిన మొదటి చిత్రం ఇది. మార్చి 1న పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ఈ మూవీలో నవదీప్, రుహానీ శర్మ, అభినవ్ గోమటం, అలీ రెజా, సంపత్ రాజ్, షతాప్ ఫిగర్, శుభశ్రీ, లహరి శేరి, స్వేత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కు ముందే.. టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని కలిగించింది. ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని నెలల ముందు ఇదే స్టోరీతో హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా రావడంతో జనాలు పెద్దగా వరుణ్ తేజ్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే లభించాయి.

అయితే పుల్వామా అటాక్స్ కు ప్రతీకారంగా ఎయిర్ స్ట్రైక్ సీన్స్, విజువల్స్, బీజీఎమ్ సినిమాలో హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. అలాగే VFX కూడా సినిమాకు ప్లస్ అయింది. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు నెలకాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వరుణ్ తేజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారు అయినట్లు తెలుస్తోంది. మార్చి 29 నుంచి ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోందని సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిచంగా.. బీజీఎం హైలెట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











