Ghani on OTT వరుణ్ తేజ్ మూవీ ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం మెగా అభిమానులను, తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. గని పాత్రకు వరుణ్ తేజ్ ఎన్నడూ లేని విధంగా కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్ చేయడం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మెగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీగా గని ప్రీ రిలీజ్ బిజినెస్
గని సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో విడుదలకు ముందే భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. ఓవర్సీస్‌లో 1.8 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 25.3 కోట్ల ప్రీ రిలీజ్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మదర్, ఫాదర్ సెంటిమెంట్
అయితే మదర్, ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన గని చిత్రం ప్రేక్షకులపై భారీగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో మొత్తంగా ఈ సినిమా 8 కోట్ల మేర రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారు 15 నుంచి 16 కోట్ల మేర నష్టాల్ని చవి చూసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

గని కథ క్లుప్తంగా ఏమిటంటే
గని కథ విషయానికి వస్తే.. నేషనల్ బాక్సర్‌గా రాణించిన తన తండ్రిపై ఓ అరోపణ రావడం, క్రీడారంగంలో రాజకీయాల కారణంగా తండ్రి తమకు దూరం కావడమనేది సినిమా ప్రధాన పాయింట్. తన తండ్రికి జరిగిన అవమానానికి, తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులుగా గని (వరుణ్ తేజ్) ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అందుకోసం గని బాక్సర్‌గా ఏం చేశాడనేది ఈ సినిమా కథ.

ఓటీటీ రిలీజ్ ముందే..
వాస్తవానికి సినిమా పరిశ్రమ పెట్టుకొన్న నిబంధన ప్రకారం.. ఏ సినిమా అయినా నెల రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేయాలి. కానీ బాక్సాఫీస్ వద్ద గని సినిమా తేలిపోవడంతో ఆ నిబంధనను సడలించి ముందే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో థియేటర్‌లో చూడలేకపోయామని ఫీల్ అవుతున్న మెగా అభిమానులు త్వరలోనే ఆహా ఓటీటీలో చూడటానికి వీలు కలుగుతుంది.

ఆహా ఓటీటీలో ఎప్పడంటే..
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా కిరణ్ దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు నిర్మాతలుగా రూపొందిన గని చిత్రం ఆహా ఓటీటీలో ఏప్రిల్ 22న రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో RRR, KGF 2 చిత్రాలు ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆహా చేస్తున్నది. ఓటీటీలోనైనా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారేమో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











