Gandeevadhari Arjuna OTT: ఆ ఓటీటీలోనే వరుణ్ తేజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదటి చిత్రం నుంచే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్తమ సినిమాలతో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. గత చిత్రం 'గని'తో మాత్రం అభిమానులను తీవ్రంగానే నిరాశ పరిచాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'గాండీవధారి అర్జున' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రమే 'గాండీవధారి అర్జున'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను అందుకుంది. దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'గాండీవధారి అర్జున' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గాండీవధారి అర్జున' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే ఆగస్టు 25న విడుదలైన 'గాండీవధారి అర్జున' సెప్టెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గాండీవధారి అర్జున' మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











