Lavanya Tripathi: కట్టెల పొయ్యిపై ఛాయ్ చేసిన మెగా కోడలు.. ఎవరి కోసమో తెలుసా?

లావణ్య త్రిపాఠి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. అలా వరుసగా సినిమాలు చేస్తూనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపించింది. ఆరు నెలల క్రితమే కుటుంబ సభ్యుల అంగీకారంతో గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కట్టెల పొయ్యిపై ఛాయ్ పెట్టింది. ఎంతో రిచ్ అయిన ఈమె.. కట్టెల పొయ్యిపై టీ పెట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆమె ఎవరి కోసం ఆమె ఇలా స్పెషల్ టీ తయారు చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లావణ్య త్రిపాఠి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా కనిపించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే 2017లో మిస్టర్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోకలిసి నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి అంతరిక్ష సినిమా కోసం కలిశారు. అయితే ఆ సినిమా చేస్తుండగానే వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా మెల్లిమెల్లిగా ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమా హిట్టుగా నిలవడం.. వీరిద్దరి మధ్య బంధం కూడా బలపడడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

Varun Tej Wife Lavanya Tripathi Make Tea on Wood Storve For Special Persons Check Details

కానీ కొంత కాలం పాటు ఆగాలనుకున్నారు. ఈక్రమంలోనే చాలా ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు.. ఇరు కుటుంబ సభ్యులకు ఈ విషంయ చెప్పారు. వాళ్లు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోగా.. నవంబర్ ఒకటో తేదీన ఇటలీలో గ్రాండ్ గా వీవరి వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటైన ఈ జంట.. ఆ తర్వాత హైదరబాద్ కు వచ్చి గ్రాండ్ గా రిసిప్షన్ కూడా ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత నుంచి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్లిపోతున్న ఈ జంట... తాజాగా మరోసారి విదేశాలకు వెళ్లింది.

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో కట్టెల పొయ్యిపై టీ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎక్కడో హిల్స్ కు.. కపుల్ ఫ్రెండ్స్ తో వెళ్లిన లావణ్య అక్కడే వారితో కలిసి టీ పెట్టింది. నాచురల్ ప్రొడక్ట్స్ వాడినట్లూ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంత రిచ్ అయిండి కూడా ఇలా కట్టెల పొయ్యిపై మీరు టీ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని కొందరు.. మెగా కోడలు అంటే మామూలుగా ఉండదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా తన అక్క ఉపాసన కామినేని కొణిదెల మాదిరిగానే.. లావణ్య త్రిపాఠి తన పేరును మార్చుకుంది. ఓ వైపు తల్లిదండ్రుల ఇంటి పేరు ఉంచుకుంటూనే భర్త ఇంటి పేరును తన పేరులో కలిపేసుకుంది. అచ్చం ఉపాసన కామినేని కొణిదెల లాగానే.. లావణ్య త్రిపాఠఇ కొణిదెల గా మారిపోయింది. సోషల్ మీడియా అకౌంట్లు అయిన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటిల్లో తన పేరును ఇలా మార్చేసుకుంది లావణ్య. ఈ విషయం గుర్తించిన నెటిజెన్లు అంతా లావణ్య చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X