OTT లో భయపెడుతున్న కొత్త హారర్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మూవీ లవర్స్ ఎప్పుడు పలికే పేరు సినిమా.. సినిమా.. సినిమా. ఎలాంటి జోనర్ అయినా అందులో కొత్తదనం ఉంటే చాలు కచ్చితంగా ఆదరిస్తారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా, మాస్ మసాలా ఉన్న అడల్ట్ చిత్రమైనా, అదిరిపోయే ఫైట్, చేజింగ్ సీక్వెన్సులు ఉన్న యాక్షన్ మూవీ అయినా.. అడ్వెంచర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, మైథలాజికల్, బయోగ్రఫీ ఏదైతే ఏంటీ.. విభిన్నంగా ఉంటే చూసేందుకు ఎగబడతారు. అయితే కొన్నిసార్లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లలో మంచి ఫలితం దక్కకపోయినా ఓటీటీలో మాత్రం ఇరగదీస్తాయి. అలాంటి ఓ హారర్ చిత్రమే ఇప్పుడు డిజిటల్ వేదికపై తెగ భయపెడుతోంది.
ఈ మధ్య ఓటీటీ వేదికలపై వచ్చిన హారర్ చిత్రాలు తక్కువే. థియేటర్లలో, ఓటీటీల్లో మసూద సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సైతం సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. మళ్లీ తాజాగా ఓ క్రేజీ హారర్ మూవీ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. జూన్ 23న థియేటర్లలో విడుదలైన చిత్రం 'అశ్విన్స్' (Asvins Movie). తమిళ నటుడు వసంత రవి ప్రధాన పాత్ర పోషించిన సినిమానే ఈ అశ్విన్స్.

తరమని చిత్రంతో నటుడిగా తనదైన మార్క్ చూపించిన వసంత రవి అనంతరం రాకీ మూవీతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తాజాగా నటించి థియేటర్లలో గతనెల విడుదలైంది అశ్విన్స్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడమో కానీ, కంటెంట్ బాగున్నా థియేటర్లలో ఆడలేదు. అయితే ఇలాంటి చిత్రాలు థియేటర్లలో వారానికిపైగా ఆడటం కష్టమన్న మేకర్స్.. 25 రోజులు దాటి థియేటర్లలో ప్రదర్శితం కావడం సంతోషంగా ఉందన్నారు.
తరుణ్ తేజా దర్శకత్వం వహించిన అశ్విన్స్ సినిమాకు ప్రముఖ తెలుగు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, శక్తివేలన్ నిర్మాతలుగా వ్యవహరించారు. దీన్ని బీవీఎస్ఎన్ ఫిల్మ్ పై బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ అశ్విన్స్ (Asvins OTT) సినిమా ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది. విభిన్నమైన సౌండ్ ఎఫెక్ట్స్, బీజీఎమ్ తో మంచి హారర్ థ్రిల్ ఇస్తుందని టాక్. అశ్విన్స్ మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో జూలై 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వసంత రవితోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ విమలా రామన్, సరస్వతి మీనన్, ఉదయరాజ్, ముగ్ధా మల్లారెడ్డి, సిమ్రన్ పరీక్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











