ఓటీటీలో బాలయ్య రికార్డు: ఒకేసారి రెండు చిత్రాలు.. టాలీవుడ్‌లో ఏకైక హీరోగా సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. గతంలో కంటే ఇప్పుడు రెట్టించిన వేగంతో సినిమాలు చేస్తోన్న ఆయన.. రెండేళ్ల క్రితమే 'అఖండ' వంటి బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అంటూ వచ్చారు. ఈ మూవీకి కూడా ప్రేక్షకులు భారీ స్పందన అందించడంతో సూపర్ హిట్ అయింది. ఇక, ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

వీర సింహా రెడ్డిగా బాలయ్య

వీర సింహా రెడ్డిగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన మాస్ చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

థియేటర్లలో సూపర్ హిట్

థియేటర్లలో సూపర్ హిట్

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో దీనికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా దూకుడు కంటిన్యూ చేసి భారీ కలెక్షన్లతో ఇది హిట్‌గా నిలిచింది.

హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్

హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్

బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీ హక్కులను తీవ్ర పోటీ నడుమ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీన్ని ఏకంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తీసుకొచ్చారు.

నిమిషంలోనే సంచలనం

నిమిషంలోనే సంచలనం

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ దీనికి అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం కేవలం ఒకే ఒక్క నిమిషంలో 150K అంటే లక్షా యాభై వేల రియల్ టైం వ్యూస్ దక్కాయి. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న ఏకైక సినిమాగా నిలిచింది.

వారం మొత్తం టాప్‌లోనే

వారం మొత్తం టాప్‌లోనే

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెస్పాన్స్ వస్తూనే ఉంది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక వ్యూస్ లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ మూవీ ఏకంగా వారం రోజుల పాటు భారీ వ్యూవర్‌షిప్‌తో టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే టాప్ మూవీగా ఇది రికార్డును సాధించింది.

అఖండ కూడా ఉందిగా

అఖండ కూడా ఉందిగా

'వీర సింహా రెడ్డి' మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అత్యధిక స్పందనతో దూసుకుపోతోంది. అదే సమయంలో బాలయ్య నటించిన గత చిత్రం 'అఖండ' కూడా అదే ఓటీటీలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం కూడా దాదాపు వారం రోజుల నుంచే రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఒకేసారి రెండు సినిమాలు ట్రెండింగ్ అయిన హీరోగా బాలయ్య రికార్డు సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X