Veera Simha Reddy: చరిత్ర సృష్టించిన బాలయ్య.. నిమిషంలోనే అన్ని లక్షలతో రికార్డు
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో దీనికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో మొదటి రోజే బాలయ్య ఎన్నో రికార్డులు సాధించారు. ఇలా ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమాకు ఆరు కోట్లకు పైగా లాభాలు సొంతం అయ్యాయి.
'అఖండ' వంటి భారీ విజయం తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ వచ్చింది. దీంతో థియేట్రికల్ రైట్స్ అత్యధిక ధరలకు అమ్ముడయ్యాయి. అలాగే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీన్ని ఏకంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారం చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ దీనికి అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం కేవలం ఒకే ఒక్క నిమిషంలో 150K అంటే లక్షా యాభై వేల రియల్ టైం వ్యూస్ దక్కాయి. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న ఏకైక సినిమాగా 'వీర సింహా రెడ్డి' రికార్డు సాధించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఇది క్రమంగా మరిన్ని రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

నటసింహా బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన మాస్ చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











