Veera Simha Reddy: బాలయ్య ఫ్యాన్స్‌కు మరో కానుక.. 25న అదిరిపోయే ఈవెంట్

గతంలో కంటే ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి 'వీర సింహా రెడ్డి' అనే సినిమా చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటసింహా నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఊహించని రీతలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 69 కోట్లుకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్లు షేర్‌తో పాటు రూ. 134 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది. అంతేకాదు, ఇప్పటికీ ఈ సినిమా పలు ప్రాంతాల్లో ప్రదర్శితం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే 'వీర సింహా రెడ్డి' మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

Veera Simha Reddy Hungama Balayya Fan Event on February 25th

'వీర సింహా రెడ్డి' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓ అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. 'వీర సింహా రెడ్డి హంగామా ఏంథమ్'ను విడుదల చేసేందుకు గానూ ఫిబ్రవరి 25వ తేదీన బాలయ్య అభిమానుల కోసం కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. వీటిని హైదరాబాద్, విజయవాడ, కర్నూలు సిటీల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు, ఓ పవర్‌ఫుల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ఓ ర్యాప్ సాంగ్‌ కూడా వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు.

ఇదిలా ఉండగా.. బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన మాస్ చిత్రమే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X