Veera Simha Reddy: బాలయ్య పెను సంచలనం.. ఈ ఫీట్ సాధించిన తొలి హీరోగా రికార్డు

ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇదే ఉత్సాహాన్ని ఇప్పటికీ చూపిస్తోన్న ఆయన.. ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకుంటూ ముందుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బాలయ్య 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో తాజాగా రికార్డును క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

మాస్ యాక్షన్ స్టోరీతోనే

మాస్ యాక్షన్ స్టోరీతోనే


నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన మాస్ యాక్షన్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

 భారీ వసూళ్లు... సక్సెస్

భారీ వసూళ్లు... సక్సెస్


రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, సంక్రాంతి సందర్భంగా విడుదల కావడంతో దీనికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా అదే రీతిలో హవాను చూపించి సూపర్ హిట్‌గా నిలిచింది.

హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్


బాలయ్య 'వీర సింహా రెడ్డి' మూవీ డిజిటల్ హక్కులను తీవ్ర పోటీ నడుమ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీన్ని ఏకంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.

 మొదట్లోనే సంచలనం

మొదట్లోనే సంచలనం


పవర్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ దీనికి అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం కేవలం ఒక్క నిమిషంలో 150K అంటే లక్షా యాభై వేల రియల్ టైం వ్యూస్ దక్కాయి. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక సినిమాగా రికార్డు సాధించింది.

నెల రోజుల్లో టాప్‌లోనే

నెల రోజుల్లో టాప్‌లోనే


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' చిత్రానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెస్పాన్స్ వస్తూనే ఉంది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక వ్యూస్ లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ మూవీ ఏకంగా నాలుగు వారాలుగా భారీ వ్యూవర్‌షిప్‌తో టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే టాప్ మూవీగా ఇది రికార్డును క్రియేట్ చేసింది.

అఖండ కూడా ట్రెండ్

అఖండ కూడా ట్రెండ్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'వీర సింహా రెడ్డి' మూవీ అత్యధిక స్పందనతో సత్తా చాటుతోంది. అదే సమయంలో బాలయ్య నటించిన గత చిత్రం 'అఖండ' కూడా అదే ఓటీటీలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం కూడా దాదాపు నాలుగు వారాలుగా 2, 3 స్థానాల్లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఒకేసారి రెండు సినిమాలు ట్రెండింగ్ అయిన హీరోగా బాలయ్య సంచలనం సృష్టించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X