Rana Naidu రెండో సీజన్ అప్పటి నుంచే.. ఈ సారి బూతులు ఎలా ఉంటాయంటే!

గతంలో మాదిరిగా ఇప్పుడు సినీ ప్రియులు థియేటర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనికి కారణం ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రావడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో కూర్చుని ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. దీంతో హీరోలంతా ఓటీటీ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. అలా విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌ను చేశారు. ఇది సక్సెస్ అవడంతో ఇప్పుడు రెండో సీజన్‌తో రాబోతున్నారు. ఆ వివరాలు మీకోసమే!

రానా నాయుడు వచ్చారు : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వచ్చిన దీన్ని సుందర్ అరోన్ సుమిత్ శుక్లా నిర్మించారు. దీనికి జాన్ స్టీవర్ట్ ఎదురురి సంగీతాన్ని అందించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.

Venkatesh and Rana Starrer Rana Naidu Season 2 Shoot Start From March 25

అలాంటి సీన్స్, డైలాగ్స్ : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ పది ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అయింది. ఇందులో ఊహించిన విధంగా ఎన్నో బూతులు ఉన్నాయి. అలాగే, కొన్ని హాట్ సీన్స్ కూడా కనిపించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేష్ నుంచి కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వినిపించాయి. దీంతో ఇది చూసిన వాళ్లంతా షాక్‌కు గురైన విషయం తెలిసిందే.

రెస్పాన్స్ మాత్రం సూపర్ : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఇందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చాలా మంది దీనిపై విమర్శలు గుప్పించారు. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో ఈ సిరీస్‌ను తెగ ట్రోల్స్ చేశారు. ఫలితంగా ఈ సిరీస్ భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Venkatesh and Rana Starrer Rana Naidu Season 2 Shoot Start From March 25

రెండో సీజన్ ఉందంటూ : ఎన్నో అంచనాల నడుమ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ పలు కారణాల సూపర్ సక్సెస్ అయింది. దీంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ను కూడా తీసుకు వస్తామని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే వెంకటేష్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో 'రానా నాయుడు' రెండో సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డేట్ ఫిక్స్ చేసిన టీమ్ : దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కాంబినేషన్‌లో రూపొందబోతున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతుందని తెలిసింది. అంతేకాదు, ఈ సిరీస్ షూటింగ్‌ను మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్‌లోనే వెంకీ, రానాలు పాల్గొంటారని తెలుస్తోంది.

Venkatesh and Rana Starrer Rana Naidu Season 2 Shoot Start From March 25

ఈ సారి బూతులు మాత్రం : మరిన్ని అంచనాలతో రూపొందనున్న 'రానా నాయుడు' రెండో సీజన్‌లో బూతులు ఎలా ఉంటాయని చాలా మంది చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో గతంలో వచ్చిన ఫస్ట్ సీజన్ కంటే తక్కువగానే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, హాట్ సీన్స్ ఉంటాయట. ఆ మధ్య వెంకటేష్ కూడా ఇదే మాట చెప్పిన సంగతి విధితమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X