Rana Naidu: రానా నాయుడికి ఘోరమైన టాక్.. వెంకటేష్ బూతు వీడియో వైరల్.. బొ** చూస్తున్నావా అంటూ!
గతంలో కంటే ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది. దీంతో ఇలాంటివి మరిన్ని రూపొందుతోన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన దీనిపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి దీనికి ఎలాంటి టాక్ వచ్చింది? వెంకీ, రానా కాంబో ఎలా ఉంది? చూద్దాం పదండి!

రానా నాయుడు వచ్చేశారుగా
విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో చేసిన సిరీసే 'రానా నాయుడు'. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వచ్చిన దీన్ని సుందర్ అరోన్ సుమిత్ శుక్లా నిర్మించారు. దీనికి జాన్ స్టీవర్ట్ ఎదురురి సంగీతాన్ని అందించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది.

అలాంటి కథతో వచ్చిన సిరీస్
పదిహేనేళ్లు జైలు శిక్షను అనుభవించిన నాయుడు అనే వ్యక్తి.. తన కొడుకు రానాను కలవడం.. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఎదురైన ఊహించని సంఘటనలతో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో వెంకటేష్ నోటి దురుసు ఉన్న వ్యక్తిగా నటించగా.. రానా కొన్ని వేరియేషన్లు ఉన్న రోల్‌ను చేశాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఎంతో హైలైట్‌గా రూపొందించారు.
రానా నాయుడు ట్విట్టర్ టాక్
స్ట్రీమింగ్‌కు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ఇండియాలోని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మాత్రం ఊహించని విధంగా టాక్ వస్తోంది. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సిరీస్ కాదని చాలా మంది ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు చెబుతున్నారు.
అవి లేకుంటే బాగుండేదని
దగ్గుబాటి రానా, వెంకటేష్ నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ను చూసిన ఓ నెటిజన్ 'రానా నాయుడు వెబ్ సిరీస్ చూడదగినదే. కానీ, ఇందులో నెట్‌ఫ్లిక్స్ తాలూకా మాటలు, ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ బాగున్నాయి. నిడివి తగ్గితే బాగుండేది. రానా, వెంకటేష్ అద్భుతంగా నటించారు' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఎవరూ చూడమని చెప్పరు
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ను వీక్షించిన మరో నెటిజన్ ఊహించని విధంగా ట్వీట్ చేశాడు. అందులో 'ఈ వెబ్ సిరీస్‌ను చూడమని మీకు ఎవరూ సిఫారసు చేయరు. అలాగే, మీరు దీన్ని చూసిన తర్వాత ఎవరినీ చూడమని చెప్పరు' అంటూ షాకింగ్‌గా పోస్ట్ చేశాడు.
వెంకటేష్ కోసం చూడకండి
రానా, వెంకటేష్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ను చూసిన ఇంకో నెటిజన్ 'వెంకటేష్ ఉన్నాడు కదా సకుటుంబ సమేతంగా చూద్దాం అని ఇంట్లో గోడ మీద టీవీలో షో వేయకండమ్మా. మొదటి ఐదు నిమిషాల్లోనే మీ ఇంట్లో మీకు వారానికి సరిపడ తిట్లు తినే కంటెంట్ ఉంది ఇందులో' అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్‌లో వెల్లడించాడు.
ఇది తెలుగు హీరోల అప్‌డేట్
ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌ను చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించాడు. 'ఇప్పుడే రానా నాయుడు చూడడం మొదలు పెట్టాను. ఓ మై గాడ్ నేను షాక్ అయ్యాను. ఇది మన తెలుగు హీరోలు చేసిందేనా? టాలీవుడ్ హీరోల అప్‌డేట్ వెర్షన్‌లా అనిపించింది' అంటూ అతడు చెప్పుకొచ్చాడు.

వెంకటేష్ బూతు వీడియోతో
'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూసిన తర్వాత చాలా మంది ఇందులో వెంకటేష్ మాట్లాడిన బూతుల గురించే చెప్పుకుంటోన్నారు. ఈ క్రమంలోనే ఆయన 'బోండాలు చూస్తున్నావా' అంటూ పలికిన ఓ బూతు డైలాగుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇలాంటివే ఇందులో ఎక్కువగా ఉన్నాయని చెబుతూ.. ఈ సిరీస్‌పై చాలా మంది పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











