Sankranthiki Vasthunnam OTT Streaming: ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.

Sankranthiki Vasthunnam OTT Update: ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా కొనసాగుతోంది. బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు 'సంక్రాంతికి వస్తున్నాం' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. విక్టర్ వెంకటేష్- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో మరోసారి సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ పుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఓటీటీ హక్కులను ఎవరు సొంతం చేసున్నారు? ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అనే వివరాల్లోకెళ్తే..

వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 కూడా బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్స్ లో తెరకెక్కిన ఈ సినిమాకు భీమ్స్ సీసిరోలియో అందించిన మ్యూజిక్ మూవీకి హైలైట్ గా నిలుస్తోంది.

Venkatesh Anil Ravipudi movie Sankranthiki Vasthunnam OTT stream will on ZEE5 after completing its theatrical run

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా రూ. 42 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ. 161 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి.. రూ. 200 కోట్ల పరుగులు పెడుతోంది. ఇలా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకీ మామ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.

ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన 10 రోజులు కూడా కాలేదు. వెంకీ మమా సినిమా (Sankranthiki Vasthunnam OTT) ఓటీటీ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇకపోతే .. ఈ సినిమా ఓటీటీ హక్కులను ZEE5 (జీ5) దక్కించుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హక్కులను ఆ ఓటీటీ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

అయితే.. ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమా స్ట్రీమింగ్ కావాలి. దీనిని బట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. ఫిబ్రవరి 10 తరువాత ZEE5 లో వెంకీ మామ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్ పై త్వరలోనే ZEE5 అధికారప్రకటన విడుదల చేసే అవకాశముంది.

More from Filmibeat

Read more about: venkatesh anil ravipudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X