Rana Naidu 2: వెంకీ మామ ఓటిటి బ్లాస్ట్.. తన అడల్ట్, యాక్షన్ సిరీస్ రానా నాయుడు 2 ఎప్పుడంటే

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓటిటి కంటెంట్ కి ఎలాంటి డిమాండ్ అండ్ మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. కాగా ఈ క్రమంలో బిగ్ స్క్రీన్స్ దగ్గర ఫెయిల్ అయ్యిన వారు లేదా బిగ్ స్క్రీన్ పై మంచి ఆఫర్స్ కోసం చూసే వాళ్ళకి ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లు మంచి పునాది అని చెప్పవచ్చు. అందుకే చాలా మంది నటీనటులు ఓటిటిలో సినిమాలు లేదా వెబ్ సిరీస్ లలో వర్క్ చేసేందుకు ఇష్టపడతారు.

కాగా హిందీ మార్కెట్ నుంచి చాలా మంది స్టార్స్ చేస్తున్నారు అలాగే ఓటిటిలో చేసిన వారు కూడా మంచి స్టార్స్ అయ్యారు. అయితే ఇది మన తెలుగు సినిమా వరకు కూడా వచ్చింది. కాగా మన దగ్గర దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన ఓటిటి షో అయితే ఒక బ్లాస్ట్ అని చెప్పాల్సిందే. అప్పటివరకు విక్టరీ వెంకటేష్ అనే హీరోని చాలా కంఫర్ట్ జోన్ లో అలాగే ఒక ఫ్యామిలీ మ్యాన్ లా చూసిన ఆడియెన్స్ ని "రానా నాయుడు" అనే సిరీస్ ఝలక్ ఇచ్చింది.

venkatesh leaks rana naidu 2 release on netflix full story news is here

కాగా వెంకటేష్ సహా రానా దగ్గుబాటి కూడా కలిపి చేసిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియెన్స్ కి షాకిచ్చింది. కాగా ఈ సిరీస్ ని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురాగా ఈ సిరీస్ లో భయంకరమైన అడల్ట్ కంటెంట్ తో పాటుగా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. దీనితో రానా నాయుడు పై చాలా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ కి రికార్డు రెస్పాన్స్ వచ్చింది.

దీనితో నెక్స్ట్ సీజన్ 2 కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తూ వచ్చారు. కాగా ఈ సిరీస్ కి సీజన్ 2 ని అంత నెగిటివ్ లో కూడా మేకర్స్ అనౌన్స్ చేసి ఇపుడు పూర్తి కూడా చేసేసారట. కాగా ఈ సిరీస్ రిలీజ్ కి కూడా ఎంతో సమయం లేదని తెలుస్తుంది. కాగా వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన పలు ఇంటర్వూస్ లో ఈ అవైటెడ్ బోల్డ్ సిరీస్ సీజన్ 2 కోసం క్రేజీ అప్డేట్ ఇవ్వడం జరిగింది.

venkatesh leaks rana naidu 2 release on netflix full story news is here

ఆల్రెడీ సీజన్ 2 తాలూకా డబ్బింగ్ ని తాను కంప్లీట్ చేసినట్టుగా తెలిపారు. అలాగే ప్రస్తుతం అయితే మార్చ్ లో రిలీజ్ తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా మార్చ్ లో ఎప్పుడు ఉండొచ్చు అనే టాక్ కి వస్తే.. దాదాపు మార్చ్ ఎండింగ్ లోనే పలు సినిమాలు టార్గెట్ చేసుకొని ఉన్నాయి.

మార్చ్ 28 లేదా 27 కి విడుదల చేసే ఛాన్స్ ఉందని చెప్పాలి. సో మొత్తానికి అయితే వెంకీ మామ మళ్ళీ బ్లాస్ట్ చేసేందుకు రాబోతున్నారని చెప్పాలి. లాస్ట్ సీజన్లోనే తన నుంచి ఊహించని బూతులు క్రేజీ అడల్ట్ సీన్స్ వంటివి కనిపించాయి. మరి ఈసారి అందుకు డోస్ ఎక్కువ ఉంటుందా లేక తగ్గించారా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X