SAINDHAV OTT: సైంధవ్ ఓటీటీ వివరాలు లీక్.. అన్ని రోజుల తర్వాతే స్ట్రీమింగ్
గతంలో అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించారు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో జోనర్లలో సినిమాలు చేసి అలరించిన ఆయన.. ఇప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీనియర్ హీరో తన ల్యాండ్ మార్క్ మూవీ (75వ)గా 'సైంధవ్'ను చేశారు.
హిట్ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రమే 'సైంధవ్'. క్రేజీ కాంబినేషన్‌లో విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఈరోజే (జనవరి 13న) గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ మూవీ సందడి కనిపిస్తోంది.

ఎంతో హైప్ నడుమ విడుదలైన 'సైంధవ్' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కనిపించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మంచిగానే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ మోస్తరుగానే ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్‌ను రాబట్టవచ్చు.
ఇక, విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రూపొందిన 'సైంధవ్' మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ పార్ట్‌నర్, డేట్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీన్ని ఫేమస్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సైంధవ్' మూవీకి సంబంధించి స్ట్రీమింగ్ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే ఇది మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. 'సైంధవ్' సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











