SAINDHAV OTT: సైంధవ్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. అసలైన సర్‌ప్రైజ్ ఏంటంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే సినిమాలు చేస్తూ.. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా క్లీన్ ఇమేజ్‌ను స్టార్‌గా దూసుకుపోతోన్నారు దగ్గుబాటి వెంకటేష్. గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే తన 75వ చిత్రంగా 'సైంధవ్'ను చేసిన విషయం తెలిసిందే.

హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను రూపకల్పనలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రమే 'సైంధవ్'. సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ కూడా లభించింది.

Venkatesh Starrer SAINDHAV Movie OTT Streaming From February 3rd

ఎన్నో అంచనాల విడుదలైన 'సైంధవ్' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా వెంకటేష్ నటించిన ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా రాబట్టలేదు. తద్వారా ఈ సినిమా భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది.

విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రూపొందిన 'సైంధవ్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. అలాగే, దీన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని తెలిసింది.

Venkatesh Starrer SAINDHAV Movie OTT Streaming From February 3rd

సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సైంధవ్' మూవీ డిజాస్టర్ కావడంతో అనుకున్న దానికంటే ముందు దీన్ని స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ఫిబ్రవరి 3వ తేదీ నుంచే అమెజాన్ సంస్థ తెలుగు, తమిళంలో అందుబాటులోకి తీసుకు రాబోతుంది. అంతేకాదు, దీనికి మరిన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'సైంధవ్' సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X