SAINDHAV OTT: ఓటీటీలోకి వచ్చేసిన సైంధవ్.. వెంకీ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఏంటంటే!
టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోలు తమదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌ను ఆకర్షించే సినిమాలతో వస్తున్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకున్న ఆయన.. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఇటీవలే 'సైంధవ్' అనే మూవీని చేశారు.
'హిట్' డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమానే 'సైంధవ్'. క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు మెడికో క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో రూపొందిన చిత్రం కావడంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించి.. సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

భారీ అంచనాల విడుదలైన 'సైంధవ్' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఫలితంగా ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా సొంతం చేసుకోలేకపోయింది. తద్వారా వెంకటేష్ నటించిన సినిమా భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కలిసి చేసిన 'సైంధవ్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని ముట్టజెప్పింది కూడా. అలాగే, దీన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, నెల లోపే దీన్ని అందుబాటులోకి తెచ్చారు.

మెడికో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సైంధవ్' మూవీని నేటి అర్ధరాత్రి నుంచే అమెజాన్ సంస్థ తెలుగు, తమిళంలో అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. ఇందులో థియేటర్ వెర్షన్ కాకుండా మరింత ఎక్కువ కంటెంట్‌ను యాడ్ చేసినట్లు తెలిసింది. మరి సినిమా హాళ్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉండగా.. వెంకటేష్ నటించిన 'సైంధవ్' సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











