Rana Naidu: నెట్ ఫ్లిక్స్ కు వెంకటేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ వెబ్ సిరీస్ టైటిల్ మార్చాలంటూ వీడియో!

టాలీవుడ్ స్టార్ హీరోలలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. వెంకటేష్ అంటే ఇష్టపడని ఏ హీరో అభిమాని ఉండనంతంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మల్టీ స్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్ ఇటీవల సైంధవ్ సినిమా అప్డేట్ ఇచ్చారు. అయితే బాబాయ్-అబ్బాయ్ అయిన వెంకటేష్-రానా కలిసి రానా నాయుడు సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ టైటిల్ మార్చాలంటూ నెట్ ఫ్లిక్స్ కు వార్నింగ్ ఇచ్చాడు వెంకటేష్.

మరో స్టార్ హీరో చేయనివిధంగా..

మరో స్టార్ హీరో చేయనివిధంగా..

కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేష్ తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలకు పెట్టింది పేరు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌‌తో 'గోపాల గోపాల', రామ్‌తో 'మసాలా', వరుణ్‌ తేజ్‌తో 'F2' అండ్ 'F3', నాగ చైతన్యతో 'వెంకీ మామ' చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత అందుకున్నాడు.

హిందీ వెర్షన్ టీజర్..

హిందీ వెర్షన్ టీజర్..

ఇప్పుడు వెంకటేష్ తన సోదరుడు కుమారుడు అయిన దగ్గుబాటి రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి డిజిటల్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఇదివరకే రానా నాయుడు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సిరీస్ కు సంబంధించిన హిందీ వెర్షన్ టీజర్ ను ఇటీవల నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో వెంకటేష్ కనిపించారు.

నెట్ ఫ్లిక్స్ కు ధమ్కీ..

నెట్ ఫ్లిక్స్ కు ధమ్కీ..

అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించినట్లు తెలుస్తోంది. జైల్లో చేతులకి సంకెళ్లతో తెల్లగడ్డంతో వెంకీ కొత్తగా కనిపించారు. తండ్రిపై చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోయే కొడుకుగా రానా కనిపించాడు. అయితే తాజాగా ఈ సిరీస్ టైటిల్ మార్చాలంటూ గన్ పట్టుకుని మరి నెట్ ఫ్లిక్స్ కు వెంకటేష్ గట్టి ధమ్కీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేయగా అది వైరల్ గా మారింది.

చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్..

చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్..

"చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్ లో హీరో నేను. అందరి కంటే పెద్ద స్టార్ ని నేను. అందంగా కనిపించేది కూడా నేనే. పైగా ఫ్యాన్స్ కూడా నావాళ్లే. కాబట్టి షోకి కూడా నా పేరే ఉండాలి. రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. బాప్ కే పంగ నామాలు పెట్టొద్దు. నాతో మజాక్ లు చేయొద్దు" అంటూ గన్ పట్టుకుని హిందీలో వెంకటేష్ బెదిరిస్తున్నట్లుగా వీడియో ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఈ వీడియో నెట్టింట్లో గింగిరాలు తిరుగుతోంది.

అమెరికన్ సిరీస్ కు అడాప్షన్..

రానా నాయుడు వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఈ నెలలో విడుదల చేస్తారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. అయితే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రానుంది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించగా.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. కాగా రానా, వెంకటేష్ ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X