Brahma Anandam OTT: ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం.. స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎందులో అంటే?

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. ఆయన ఫోటో చూడకుండా తెలుగు వారికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి ఎందరో కమెడియన్లు వచ్చారు, వెళ్లారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ బ్రహ్మానందం స్థానం మాత్రం ప్రత్యేకం. కామెడీకి కేరాఫ్‌గా నిలిచిన ఆయన 70 ఏళ్ల వయసులోనూ నవ్విస్తున్నారు. ఇటీవల బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది . ఈ వివరాల్లోకి వెళితే..

తన కుమారుడు రాజా గౌతమ్‌తో చాలా కాలం తర్వాత బ్రహ్మానందం కలిసి నటించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో బ్రహ్మా ఆనందం చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. ఇక బ్రహ్మానందం తన వయసును కూడా లెక్క చేయకుండా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.

vennela kishore raja goutham s Brahma Anandam Movie now streaming on Aha Video

కామెడీ, ఎమోషన్స్, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికాలు , ప్రమోషన్ కార్యక్రమాలు కలుపుకొని ఈ మూవీని దాదాపు 4.50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 2.5 కోట్ల రూపాయలుగా జరగగ్గా.. బ్రహ్మా ఆనందం లాభాల్లోకి రావాలంటే రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన బ్రహ్మా ఆనందం సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి రోజు రూ.35 లక్షలు, రెండో రోజు రూ.40 లక్షలు, మూడో రోజు రూ.50 లక్షలు, 4వ రోజు రూ.25 లక్షల రూపాయలను రాబట్టింది. మొత్తంగా బ్రహ్మా ఆనందం థియేట్రికల్ రన్ ముగిసేనాటికి రూ. 2.5 కోట్ల కలెక్షన్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌కు దగ్గరిగా నిలిచింది. స్వల్ప నష్టాలు ఎదురైనప్పటికీ సినిమాకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమాను కూడా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారని మేకర్స్‌ను ప్రశంసించారు.

vennela kishore raja goutham s Brahma Anandam Movie now streaming on Aha Video

ఇక బ్రహ్మా ఆనందం సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. థియేటర్‌లలో రిలీజై నెల రోజులు కావొస్తుండటంతో ఓటీటీ రిలీజ్‌పై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా హోలీ కానుకగా మార్చి 14 నుంచి అందుబాటులో ఉంటుందని ఆహా అధికారికంగా వెల్లడించింది. థియేటర్‌లో మంచి ప్రయత్నంగా మన్ననలు పొందిన బ్రహ్మా ఆనందం చిత్రం ఓటీటీలో ఎంత మేరకు రాణిస్తుందో? ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: vennela kishore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X