సడెన్‌గా OTTలోకి వచ్చేసిన స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్.. థ్రిల్లవుతూ నవ్వాలనుకుంటే అలా చూసేయండి!
గత ఆరు నెలలుగా అంతా థ్రిల్లర్, హార్రర్ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. జనాలు వాటినే చూసేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ఎక్కువగా అలాంటి చిత్రాలే తీసుకు వచ్చారు. కానీ గత పక్షం రోజులుగా ఓటీటీలో కామెడీ సినిమాల హవా కూడా పెరిగిపోయింది. ఇప్పటికే ఓటీటీలో మూడు సూపర్ డూపర్ హిట్ కామెడీ చిత్రాలు విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. నేడు మరో తాజా స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే థ్రిల్ అవుతూనే కడుపుబ్బా నువ్వాలనుకుంటే ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఏంటి, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రమే చారి 111. బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మించిన ఈ సినిమాకు టీ.జీ. కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో పాటు మురళీ శర్మ, సంయుక్తా విశ్వనాథన్, సత్య, పావనీ రెడ్డి గంగిరెడ్డి, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, సత్య, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే కాశీష్ గ్రోవర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. రిచర్డ్ కెవిన్ ఏ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.

అదిరిపోయే స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ థియేటర్ల వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయిందీ చిత్రం. మోస్తరు కలెక్షన్లు సాధించుకుని.. సైలెంట్ గా థియేటర్ల నుంచి పక్కకు జరిగింది. అయితే ఇంతకాలం ఈ సినిమా గురించి ఎలాంటి చప్పుడు లేకపోగా.. నేరుగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఏప్రిల్ 5వ తేదీ అంటే ఈరోజు నుంచే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంది. కామెడీతో పాటు స్పై అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే. కాసేపు నవ్వుకోవాలన్నా.. ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయాలనుకున్న ఇలాంటి సినిమాలు చూస్తే బెటర్. మరి ఇంకెందుకు ఆలస్యం.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రాన్ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











