ఓటీటీలో ట్రెండింగ్‌గా కామెడీ, స్పై థ్రిల్లర్.. ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే?
బర్కత్ స్టూడియో బ్యానర్‌పై యువ నిర్మాత అదితి సోని నిర్మించిన చిత్రం చారీ 111. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ స్పై థ్రిల్లర్ సినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, సత్య, బ్రహ్మజీ, పావనిరెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నదనే వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో విధ్వంసం చేయాలనే అసాంఘీక శక్తుల కుట్రలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో ఏజెంట్ 111గా వెన్నెల కిషోర్ సీరియస్‌తోపాటు వినోదాన్ని పంచే పాత్రలో నటించారు. చారీ 111 చేపట్టిన మిషన్‌లో అతడికి సహకారం అందించడానికి ఇషా పాత్రలో సంయుక్త మీనన్ నటించింది. మురళీ శర్మ, రాహుల్ పాత్రలు సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి.

చారీ 111 సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. థియేట్రికల్ రన్‌ను ముగించుకొని ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. థియేట్రికల్‌గా కొంత మేరకు మెప్పించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు అనూహ్యంగా ఆదరిస్తున్నారు. దాంతో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండిగ్ అవుతున్న వాటిలో ఒకటిగా నిలచింది.
ఓటీటీలో చిన్న చిత్రాల జాబితాలో అత్యధిక వ్యూయింగ్ మినట్స్‌ను సాధించడం అందరి దృష్టి పడుతున్నది. ఇక ఈ సినిమా ఓటీటీలో చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఓటీటీలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చారీ 111 సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా మాకు సంతృప్తిని అందించింది. అయితే అమెజాన్‌లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని ఊహించాం. మా అంచనాలకు తగినట్టుగా ఈ మూవీ ట్రెండ్ కావడం ఆనందంగా మింది అని నిర్మాత అదితి సోని అన్నారు


Click it and Unblock the Notifications











