OTTలో భయపెడుతున్న తెలుగు హార్రర్ థ్రిల్లర్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

థియేటర్ కు పోయే ఓపిక లేని వారికి ఓటీటీ సంస్థలు ప్రతివారం కొత్త కొత్త కంటెంట్ ను అందిస్తోంది. ఇక వారం కూడా ఓ కొత్త వెబ్ సీరిస్ ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. అంతేనా... ప్రేక్షకులను భయపెడుతోంది. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన వేణు తొట్టెంపూడి... ఇప్పుడు ఓటీటీ వేదికపై హీరోగా మారి.. ఓ వెబ్ సీరిస్ లో నటించారు. ఆ వెబ్ సీరిసే అతిథి. ఇక ఈ సీరిస్ ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే...

వేణు తొట్టెంపూడి... హీరోగా టాలీవుడ్ లో మంచి సినిమాలు చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించే వాడు. చిరునవ్వుతో, హనుమాన్‌ జంక్షన్‌, కల్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, పెళ్లాంతో పనేంటి, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, శ్రీకృష్ణ 2006, అల్లరే అల్లరి, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపిక గోదావరి తదితర వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

Web Series Horror Thriller Athidhi

అయితే వేణు హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి గెస్టు రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. చింతకాలయ రవి, దమ్ము వంటి సినిమాల్లో నటించాడు. ఇటీవల వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే సినిమా ప్లాఫ్‌ కావడంతో వేణుకు నిరాశ తప్పలేదని చెప్పాలి.

ఇక ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్ ఫాం వేదికగా తన ప్రతిభను పరీక్షించుకోవడానికి వచ్చాడు. అతిథి అనే పేరుతో ఓ హార్రర్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పోస్టర్స్‌, ట్రైలర్‌ విభిన్నంగా ఉండటం వల్ల ఆసక్తిని కలిగించాయి. అంతే కాదు.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించారు. ఇక వేణు అతిథిపై ఆసక్తిని పెంచేశాయి.

Web Series Horror Thriller Athidhi

తాజాగా ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. మంగళవారం అనగా సెప్టెంబర్‌ 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో అతిథి స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ అందుబాబులోకి వచ్చింది.

అతిథి వెబ్‌ సిరీస్‌ కు భరత్ దర్శకత్వం వహించాడు. వేణుతో పాటు అవంతిక, రవివర్మ, భద్రం, అదితీ గౌతమ్‌, వెంకటేష్ కాకుమాను, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రవీణ్‌ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇక వెబ్ సీరిస్ రిలీజ్ అయి.. ప్రేక్షకులను అలరిస్తుంది. మీరు గనుక థ్రిల్లర్ ఫీల్ కావాలనుకుంటే ఈ సీరిసును చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X