Vidudala OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన సంచలన చిత్రం.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మధ్య కాలంలో సినిమాలు నేషనల్ రేంజ్ లో గుర్తింపు పొందుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు సంపాదిస్తున్నాయి. కాంతార వంటి సినిమాలు ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. అయితే ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనంగా మారిన చిత్రం విడుదల. కొన్ని నెలల క్రితం తమిళంలో విడుదలై అక్కడ సూపర్ హిట్ అందుకుంది ఈ సినిమా. తర్వాత తెలుగులోనూ విడుదల చేశారు. అయితే ఈ సినిమాను అనుకోకుండా ఓటీటీలో ప్రత్యక్షమైంది.
అసురన్ వంటి క్రేజీ చిత్రాలను డైరెక్ట్ చేసిన వెట్రిమారన్ ఇటీవల తెరకెక్కించిన చిత్రమే విడుదల. కోలీవుడ్ పాపులర్ కమెడియన్ సూరిని హీరోగా పెట్టి రూపొందించిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలై తమిళంలో భారీ విజయం సాధించింది. అనంతరం నెల రోజులకు విడుదల సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా తమిళం స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ తెలుగులో మోస్తరు విజయం అందుకుంది.

అలాంటి సినిమా అయిన విడుదల చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ విడుదల మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులో కూడా ప్రదర్శించబడుతోంది. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ కట్ వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఈ డెరెక్టర్ కట్ వెర్షన్ మాత్రం ఇంకా తెలుగులోకి రాలేదు. డైరెక్టర్స్ కట్ అంటే సాధారణ సినిమా వెర్షన్ కంటే భిన్నంగా డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా కొన్ని సీన్లు కట్ చేసి చూపిస్తారు. అయితే ఈ డైరెక్టర్ కట్ తెలుగులో లేకపోవడం నిరాశే.
కాగా ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చిత్రీకరణ అనుకున్నారు. విడుదల పార్ట్ 1 సినిమాలో కమెడియన్ సూరితోపాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఇంకా భవానీ స్రే, రాజీవ్ మీనన్, చేతన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ ఇతర పాత్రలు పోషించారు. ఆర్ ఎస్ ఇన్ఫోటైన్ మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై ఎల్ రెడ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రెండ పార్ట్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.


Click it and Unblock the Notifications











