Vettaiyan OTT Platform: రజినీకాంత్ వేట్టయన్ డిజిటల్ రైట్స్ ఆ సంస్థకే.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Vettaiyan OTT Platform: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 'వేట్టయన్'(Vettaiyan) నేడు(గురువారం) భారీ అంచనాలతో మధ్య థియేటర్ లో రిలీజైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించారు. ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. కాగా పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. తాజాగా ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. ఇంతకీ అప్డేట్ ఏంటో లూక్కేయండి.
సూపర్‌స్టార్ నటించిన 170వ సినిమా వేట్టయన్ ది హంటర్. ఈ మూవీ దసరా కానుకగా నేడు ( అక్టోబర్ 10) తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయ్యింది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీతో అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించగా.. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఇక ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

వేట్టయన్ విడుదలకు ముందే.. రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు వేట్టయన్‌పై హైప్‌ను భారీగా పెంచేశాయి. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ నుంచి దూసుకపోతుంది. మన దేశంలో ఆడపిల్లలకు, మహిళలకు భద్రత లేదు.. కానీ పోరంబోకులకు భద్రత ఉందంటూ బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేసే ట్రైలర్.. ఈ సినిమాపై భారీ హైప్స్ ను క్రియేట్ చేస్తోంది.
TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టైయన్ మూవీకి కిరుతిక సహ రచయితగా పనిచేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. భారీ అంచనాల ముందుకు వచ్చినా ఈ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రెడ్ జెయింట్ సంస్థ దక్కించుకోగా.. ఓవర్సీస్‌లో లైకా ప్రొడక్షన్స్ ఓన్‌గా విడుదల చేసింది. ఇక కేరళలో శ్రీ గోకులం మూవీస్ వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే.. వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడు పోయాయి. తమిళనాడులో వేట్టయన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.73 కోట్లకు సేల్ కాగా.. తెలుగులో రూ.17 కోట్లు, కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ రూ.25 కోట్లతో పాటు ఓవర్సీస్‌లో రూ.45 కోట్లకు అమ్ముడు పోయింది.

ఇక డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. రజినీకాంత్ మూవీ 'వేట్టైయన్' పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కాకున్నది. అధికారిక OTT విడుదల తేదీని మేకర్స్ కొన్ని వారాల్లో లేదా ఒక నెలలోపు ప్రకటిస్తారు. దీని బట్టి చూస్తే.. సినిమా విడుదల అయినా తరువాత 40 నుంచి 50 రోజుల మధ్య ఓటీటీలోకి రానున్నట్లు సినిమా వర్గాలు అంచన వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











