ఇద్దరు హీరోలతో హీరోయిన్ శృంగారం.. ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ బోల్డ్ మూవీ
ఒకప్పుడు బోల్డుగా సాగే సినిమాలు చేయాలంటే హీరోలు వెనుకడుగు వేసేశారు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో అలాంటి తరహా చిత్రాలను చేయడానికి కూడా అందరూ రెడీ అనేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి మూవీలు ఎక్కువగా వచ్చి అలరిస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన క్రేజీ సినిమానే 'బ్యాడ్ న్యూజ్' (Bad Newz).
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'బ్యాడ్ న్యూజ్'. ఎంతో సాధించాలని కలలు కనే అమ్మాయి.. అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. తర్వాత మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం.. చివరికి వాళ్లిద్దరి వల్ల తల్లి అవడం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఇది ఆరంభంలోనే ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన 'బ్యాడ్ న్యూజ్' సినిమాకు ఆరంభంలో వేసిన ప్రీమియర్ షోల నుంచే టాక్ డిఫరెంట్‌గా వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించదని అంతా అనుకున్నా అలా జరగలేదు. ఫలితంగా ఫుల్ రన్‌లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో నిర్మాతలకు లాభం చేకూర్చింది.
గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో రూపొంది 'బ్యాడ్ న్యూజ్' మూవీ విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీగానే పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా చెప్పింది.

యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసే కథతో వచ్చిన 'బ్యాడ్ న్యూజ్' మూవీని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెస్తుందని ఇప్పటికే సమాచారం లీకైంది. అయితే, తాజాగానే ఈ చిత్రం ఆ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి మాత్రం దీన్ని రెంట్ పద్దతిలో తీసుకు వచ్చింది. అలా కూడా ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఆనంద్ తివారి దర్శకత్వంలో విక్కి కౌశల్, త్రిప్తి డిమ్రి, అమీ విర్క్ నటించిన 'బ్యాడ్ న్యూజ్' మూవీని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా క్రియేటివ్, అమెజాన్ ప్రైమ్ సంస్థలపై కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ్ మెహతా, ఆనంద్ తివారి నిర్మించారు. ఇందులో నేహా ధూపియా, కరణ్ అజ్లా, తరుణ్ దడేజాలు నటించారు. ఏడుగురు దీనికి మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











