ఒకేసారి ఇద్దరి వల్ల తల్లయ్యే హీరోయిన్.. ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ బోల్డ్ మూవీ

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టులతో మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం బోల్డు కంటెంట్‌తోనే రూపొందుతోన్నాయి. అలా ఇటీవలే ఎవరూ ఊహించని కథలతో క్రేజీ సినిమాలు వచ్చి ఆడియెన్స్‌ను ఓ రేంజ్‌లో మెప్పించాయి. అలాంటి ఓ అడల్ట్ కంటెంట్ మూవీనే 'బ్యాడ్ న్యూజ్' (Bad Newz).

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ, అమీ విర్క్ మెయిల్ లీడ్స్‌గా నటించిన సినిమానే 'బ్యాడ్ న్యూజ్'. ఓ గోల్ సాధించాలన్న లక్ష్యంతో ఉన్న అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. తర్వాత వేరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే కాన్సెప్టుతో ఈ మూవీ వచ్చింది. దీంతో ఇది ఆరంభంలోనే బాగా హైలైట్ అయింది.

Vicky Kaushal Starrer Bad Newz Movie Streaming Started on Amazon Prime

డిఫరెంట్ బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన 'బ్యాడ్ న్యూజ్' సినిమాకు ఆరంభంలో వేసిన ప్రీమియర్ షోల నుంచే టాక్ మిక్స్‌డ్‌గా వచ్చింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించదని అంతా భావించారు. కానీ అలా జరగకుండా ఫుల్ రన్‌లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. దీంతో నిర్మాతలకు లాభాలనూ అందించింది.

విక్కీ కౌశల్ - త్రిప్తి డిమ్రీ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్యాడ్ న్యూజ్' మూవీ విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీగానే పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్‌ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Vicky Kaushal Starrer Bad Newz Movie Streaming Started on Amazon Prime

యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన 'బ్యాడ్ న్యూజ్' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఇటీవలే రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాను సదరు సంస్థ ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో ఈ చిత్రానికి అమెజాన్‌లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఆనంద్ తివారి డైరెక్షన్‌లో విక్కి కౌశల్, త్రిప్తి డిమ్రి, అమీ విర్క్ నటించిన 'బ్యాడ్ న్యూజ్' మూవీని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా క్రియేటివ్, అమెజాన్ ప్రైమ్ సంస్థలపై కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ్ మెహతా, ఆనంద్ తివారి నిర్మించారు. ఇందులో నేహా ధూపియా, కరణ్ అజ్లా, తరుణ్ దడేజాలు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X