11 నెలల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ మూవీ.. నవ్వించి, కవ్వించే దీన్ని ఎందులో చూడాలంటే!

ఈ మధ్య తెలుగు సినిమాల రేంజ్ పెరగడంతో పాటు దక్షిణాదిలో గొప్ప కంటెంట్‌తో మూవీలు వస్తున్నాయి. దీంతో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ కాస్త తగ్గిపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా అక్కడి రొమాంటిక్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని సినిమాలు ఆకట్టుకుంటోన్నాయి. అలాంటి వాటిలో 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ఒకటి.

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా.. లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమానే 'జరా హాట్కే జరా బచ్కే'. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఎంతో హైప్‌తో ఇది గత ఏడాది జూన్ 2వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Vicky Kaushal Starrer Zara Hatke Zara Bachke Digital Streaming From May 17th

విక్కీ కౌశల్ - సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'జరా హాట్కే జరా బచ్కే' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా లభించాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఫలితంగా ఈ చిత్రం రూ. 120 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

కామెడీ అండ్ రొమాంటిక్ జోనర్‌లో రూపొందిన 'జరా హాట్కే జరా బచ్కే' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ జియో సినిమా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌‌పై అదిరిపోయే న్యూస్ లీక్ అయింది.

Vicky Kaushal Starrer Zara Hatke Zara Bachke Digital Streaming From May 17th

'జరా హాట్కే జరా బచ్కే' మూవీ విడుదలై 11 నెలలు అవుతోంది. అయినప్పటికీ ఇది ఇప్పటి వరకూ ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు జియో సినిమా ప్లాన్ చేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ మే 17వ తేదీ నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందట. దీనిపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'జరా హాట్కే జరా బచ్కే' సినిమాను మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సందీప్ శిరోద్కర్, సచిన్ - జిగర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీలో ఇనాముల్హాక్, సుస్మితా ముఖర్జీ, రాకేష్ బేడీ, షరీబ్ హష్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X