OTTలోకి వచ్చేసిన సూపర్‌హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఎందులో చూడాలంటే?
వీకెండ్ వచ్చేసింది.. ఇక కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోరిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ లవర్స్ కోసం.. ఓటీటీ సంస్థలు సైతం కొత్త సినిమాలను, సిరీసులను తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌషల్ హీరోగా నటించిన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా కథేంటి.. ఎందులో చూడాలి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి.. ఇక్కడి వారికి బాగా కనెక్ట్ అయ్యాయి. విక్కీ కౌషల్ నటించిన చిత్రాలు ఉరి:ది సర్జికల్ స్ట్రైక్', మసాన్ , సర్దార్ ఉద్దమ్ వంటి చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి.

ఇక విక్కీ కౌషల్.. కత్రినా కైఫ్ ను పెళ్లాడటంతో.. మరింత పాపులర్ అయిపోయారు. కత్రీనాను విక్కీ గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విక్కీ కౌషల్ నటించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా విక్కీకి జాతీయ అవార్డును సైతం తీసుకువచ్చింది. ఇక గత ఏడాది విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటించిన 'సర్దార్ ఉద్దం' కూడా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంది.
ఇక తాజాగా విక్కీ నటించిన చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ'. ఈ సినిమాలో విక్కీ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.

ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ధూమ్ త్రీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాల ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో యశ్పాల్ శర్మ, వేదాంత సిన్హా, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, సదియా సిద్ధిఖీ, అల్కా అమీన్, సృష్టి దీక్షిత్, భువన్ అరోరా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 50 వ చిత్రం గా రూపొందింది.
ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా డిజిటల్ ప్రిమియర్ కు సిద్ధం అయింది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కనుక ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఇంట్లో కూర్చొనే చూసేయండి.


Click it and Unblock the Notifications











