OTTలోకి వెంకీ మామ 75 సెలబ్రేషన్స్... ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, సిరీసులు రావడం కామన్. అయితే ఈ మధ్య ఈవెంట్లను కూడా ఓటీటీలో ప్రసారం చేస్తున్నారు. ఇటీవల వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ 'సైంధవ్‌' నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల వైభవంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు చిరంజీవి, రాఘవేంద్రరావు, నాని, శ్రీవిష్ణు, అడవిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఇక ఈ వేడక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్... తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే వరుస విజయాలతో తన ఇంటిపేరునే విక్టరీగా మార్చుకున్న వెంకటేష్.. ఈటీవల తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన 75వ మూవీగా 'సైంధవ్‌' సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Victory Venkatesh 75 Movies Completed Event Venky 75 Streaming on ETV Win OTT From Dec 31st Full Details Here

సైంధవ్ సినిమా విషయానికి వస్తే... వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది. సైంధవ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల ఓ ఈవెంటను ఏర్పాటు చేసింది.

ఇక వెంకీ మామ 75 ఈవెంటుకు చిరంజీవి , రాఘవేంద్రరావు చీఫ్ గెస్టులుగా హాజరు అయ్యారు. వీరితో పాటుగా నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. వంటి తదితర సినీ ప్రముఖులు వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది.

Victory Venkatesh 75 Movies Completed Event Venky 75 Streaming on ETV Win OTT From Dec 31st Full Details Here

ఇక ఈ గ్రాండ్ ఈవెంటును ఈటీవీ విన్ కొనుగోలు చేయడంతో... బయట ఎవరు టెలికాస్ట్ చేయలేదు. కేవలం కొంతమంది ఫ్యాన్స్ మధ్యే ఈ ఈవెంటును నిర్వహించారు. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమోను విడుదల చేయగా.. ఈ ప్రోమో ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచులు, గేమ్స్ వంటివి నిర్వహించారు.

Victory Venkatesh 75 Movies Completed Event Venky 75 Streaming on ETV Win OTT From Dec 31st Full Details Here

వెంకీ 75 సెలబ్రెషన్స్ ప్రోమో.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఫుల్ ఈవెంట్ ను చూడాలంటే... ఈటీవీ విన్ ఓటీటీ యాప్ లో డిసెంబర్ 31 నుంచి సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. దీంతో వెంకీ మామ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంటును చూసేందుకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా.. ఫ్రీగా న్యూఇయర్ కానుకగా ఓటీటీలో చూసేయొచ్చు. ఇంకేందుకు ఆలస్యం ఈ ఈవెంటును సాయంత్రం 6 గంటలకు ఫ్రీగా ఫ్యామిలీతో కలిసి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X