Vidaa Muyarchi అజిత్ మూవీ విషయంలో నెట్‌ఫ్లిక్స్, లైకా రూల్స్ బ్రేక్.. విదా ముయార్చి ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అర్జున్ సర్జా, త్రిషా, రెజినా కంసాడ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విదా ముయార్చి (Vidaa Muyarchi). ప్రతిష్టాత్మక బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి ముగిజ్ తిరుమెని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అభిమానులకు కిరాక్ లేపే వార్తను అందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
విదా ముయార్చి (Vidaa Muyarchi) చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే.. ఈ సినిమాకు వాస్తవంగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సింది. అలాగే ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఉంటుందని తొలుత ప్రకటన చేశారు. అయితే చివరకు ఈ ఇద్దరు కూడా ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. స్క్రిప్టు బాగాలేకపోవడంతో విగ్నేష్ స్థానంతో మగిజ్ తిరునేని బోర్డుపైకి తీసుకొచ్చారు.

ఇక విదా ముయార్చి (Vidaa Muyarchi) చిత్రం డిజిటిల్ రైట్స్ సినిమా సెట్స్‌పై ఉండగానే అమ్మకాలు జరిగిపోయాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్‌ను సన్ టెలివిజన్ దక్కించుకొన్నది. ఈ రైట్స్‌కు భారీగా రేటు పలికిందని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
విదా ముయార్చి (Vidaa Muyarchi) సినిమా ఓటీటీ రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ ప్రకటన చేస్తూ.. అభిమానులకు సంతోషకరమైన వార్తను అందించింది. అజిత్ సినిమా ఎలక్ట్రిఫైయింగ్ అనుభూతిని అందిస్తుంది. అజిత్ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్నది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అని నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ప్రకటనపై లైకా ప్రొడక్షన్స్ స్పందిస్తూ.. సినిమా పరిశ్రమలో అజిత్ కుమార్ ఒక్కడే ఎలక్ట్రిఫైయింగ్ అనుభూతిని కలిగిస్తాడు. విదా ముయార్చి సినిమా తమిళ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తాం అని పేర్కొన్నారు. అయితే రిలీజ్ డేట్ గానీ, ఓటీటీ రిలీజ్ డేట్ గానీ వెల్లడించకపోవడంతో అభిమానులు ఆ తేదీల గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా హిందీ, ఇతర భాషల్లో సినిమా రిలీజ్ తర్వాత 50 నుంచి 60 రోజుల్లోపు ఓటీటీ రిలీజ్ అవుతుంటుంది. కానీ అజిత్ సినిమా విదా ముయార్చి (Vidaa Muyarchi) మాత్రం వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం రూల్స్ బ్రేక్ చేయడమే అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. ఇలా రిలీజ్ తర్వాత వెంటనే ఓటీటీలో విడుదల చేయడం వెనుక అసలు ప్లాన్ ఏమిటో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











