ఓటీటీలోకి రాబోతున్న అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీ.. ఎక్కడ, ఎప్పుడు చూడాలో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి సినిమాలు కూడా థియేటర్లలోలకి వచ్చి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు. అప్పుడే పెద్ద చిత్లాలు రిలీజ్ కావడం లేదంటే వేరే ఇత ఇంట్రెస్టింగ్ సినిమా రావడంతో చాలా మంది వాటిని చూస్తూ.. కొన్ని చిత్రాలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల మనసులో స్థానం ఏర్పరుచుకున్న అనేక చిత్రాలు ఉన్నాయి. అయితే అలాంటి కోవలోకే వస్తుంది మనం ఇప్పుడు చూడబోయే సినిమా. బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ అయింది. అద్భుతమైన కథతో అందరినీ అలరించే ఈ సినిమా పలు కారణాల వల్ల ఎక్కువగా థియేటర్లలో ఆడలేకపోయింది.
ప్రస్తుతం ఆ అద్భుతమైన సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఆ చిత్రం ఏంటి, ఎప్పటి నుంచి ఓఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భావోద్వేగభరితమైన కథతో వచ్చిన 12th ఫెయిల్ సినిమా నిజంగానే మనసును హత్తుకునేలా ఉంటుంది. నిజ జీవిత కథతో వచ్చిన ఈ సినిమాలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఓ అబ్బాయి ఐపీఎస్ ఎలా అయ్యాడు.. ఆ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కున్నాడు అనే కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరించింది.

ఇదే కాన్సెప్ట్ తో గతంలో తెలుగులో కూడా ఓ సినిమా వచ్చింది. అదే ఎస్ఎస్సీ. నవదీప్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. హిట్టుగా నిలవడమే కాకుండా అనేక మంది మదిలో ఇప్పటికీ నిలిచిపోయింది. చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచిన ఈ సినిమాను మించి 12th ఫెయిల్ ఉందని చాలా మంది చెబుతున్నారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీన హిందీలో విడుదల అయింది. నవంబర్ 3వ తేదీన తెలుగు వెర్షన్ లో రిలీజ్ అయింది. కాకపోతే అదే రోజు మరెన్నో అద్భుతమైన సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ముఖ్యంగా పొలిమేర 2, కీడాకోలా వంటివి వచ్చి అలరించాయి. దీంతో తెలుగులో 12th ఫెయిల్ సినిమాకు పెద్దగా థియేటర్లు కూడా దొరకలేదు.

ఇలా మంచి కథ అయినా సరే ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ వేధికగా రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 29వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూడని వారు ఇప్పుడు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అద్భుతమైన కథతో వచ్చిన ఈ చిత్రాన్ని అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











