‘అందమైన భార్య ఉంటే లైట్లు ఆర్పేసి చీకట్లో రోజు పండుగే’

దీపావళీ పండుగ కానుకగా బాలీవుడ్‌లో రిలీజైన భూల్ భులయ్యా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబడుతున్నది. విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ తదితరులు నటించిన ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంచనాలను మించి పెర్ఫార్మ్ చేస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదాగా సాగిన సంభాషణ వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో టాప్ రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. ఈ సిజన్‌లో టాప్ సెలబ్రిటీలు సందడి చేశాడు. అయితే భూల్ భులయ్యా 3 ముందు ఈ సినిమాలో నటించిన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, రాజ్ పాల్ యాదవ్, త్రిప్తి డిమ్రీ, దర్శకుడు అనీష్ బజ్మీ ఈ షోలో పాల్గొని తమ సినిమా గురించిన వివరాలను, విశేషాలను వెల్లడించారు.

Vidya Balan funny Conversation with Kapil Sharma s The Great Indian Kapil Show amid Bhool Bhulaiyaa 3 Promotions

అయితే త్రిప్తి డిమ్రీను చూసిన ఓ కమెడియన్.. యానిమల్ చిత్రంలోని హాట్ హాట్ సన్నివేశాల గురించి కామెంట్ చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో శృంగార సన్నివేశాల్లో నటించావు కదా. స్క్రీన్ పైనా బాగుంది. ఆఫ్ స్క్రీన్ కూడా అలాంటి పనులేమైనా చేశావా? అని అడిగితే.. కొంతసేపు త్రిప్తి షాక్ అయింది. ఆ తర్వాత తడుముకొని.. అలాంటిదేమీ లేదని కామ్‌గా సమాధానం ఇచ్చింది.

అయితే ఈ షోలో కామెడీ సంబాషణ సందర్భంగా.. కపిల్ శర్మ మాట్లాడుతూ.. అందమైన భార్య ఉంటే లైట్లు వేసుకోకుండా పనులు చేసుకోవచ్చు అని అన్నాడు. దాంతో విద్యాబాలన్ ఏమంటున్నావు. నీవు అనేది ఏంటి? చీకట్లో ఏం పనులు చేస్తుంటావు? నీ మాటల వెనుక ఉద్దేశం ఏమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే తాను తప్పుగా మాట్లాడానని గ్రహించిన కపిల్ ఏదో సర్ది చెప్పబోయాడు.

Vidya Balan funny Conversation with Kapil Sharma s The Great Indian Kapil Show amid Bhool Bhulaiyaa 3 Promotions

అయితే కపిల్ శర్మ మాటలకు అడ్డుపడుతూ.. నీవు అన్నది నిజమే. నీవు నా పక్క ఫ్లాట్‌లోనే ఉంటావు. లాక్‌డౌన్‌లో ఎప్పడూ నీ బెడ్రూంలో లైట్ వెలుగలేదు. ఆ రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టారు. లైట్లు కూడా వెలుగలేదు అంటూ సెటైర్లు వేసింది. దాంతో అందరూ నవ్వులూ మునుగిపోయాడు. అయితే నా ఉద్దేశం అలా కాదు.. బ్యూటీఫుల్ వైఫ్ ఉంటే ఇంట్లో వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుతురులో లైట్స్ కూడా అవసరం ఉండదు అంటూ కపిల్ సర్దిచెప్పాడు.

భూల్ భులయ్యా 3 సినిమా విషయానికి వస్తే.. గత 10 రోజులుగా కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 220 కోట్ల రూాపయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 80 కోట్ల రూపాయలు వసూలుచేసింది. దాంతో ఈ చిత్రం 300 కోట్ల రూపాయలు రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X