Bichagadu 2 OTT: బిచ్చగాడు 2 ఓటీటీ వేదిక ఇదే.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ మాస్ మహారాజా దరువు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన విజయ్.. నటించిన నకిలీ, డా. సలీమ్, డా. సలీమ్ 2 వంటి చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక బిచ్చగాడు మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు తాజాగా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో బిచ్చగాడు 2 ఓటీటీ రైట్స్ ఆసక్తికరంగా మారాయి.

మ్యూజిక్ డైరెక్టర్ గా కోలీవుడ్ లో విశేషమైన గుర్తింపు సాధించాడు విజయ్ ఆంటోని. ఆ తర్వాత హీరోగా చేసింది చిన్న సినిమాలు అయినప్పటికీ కాన్సెప్ట్ పరంగా మంచి విజయం అందుకున్నాయి. హీరోగా, సంగీత దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా కూడా ప్రతిభ చూపిందుకు రెడీ అయ్యారు. ఆయన తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2). తాజాగా ఈ సినిమా మే 19న విడుదలైంది.

Vijay Antony Bichagadu 2 OTT Rights To Disney Plus Hotstar

శుక్రవారం విడుదలైన బిచ్చగాడు 2 సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. అయితే ఈ సమయంలో బిచ్చగాడుకు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 మూవీ ఓటీటీ పార్టనర్ విషయాలు ఆసక్తికరంగా మారాయి. బిచ్చగాడు 2 సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ జూన్ మూడో వారంలో డిజిటల్ తెరపై కనువిందు చేసేందుకు రెడీగా ఉండేందుకు అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

బిచ్చగాడు 2 సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ చేసింది. దేవ్ గిల్, రాధారవి, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని విజయ్ ఆంటోనీ సతీమణి ఫాతిమా ఆంటోని నిర్మించారు. అయితే 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుందు. ఎంతలా అంటే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుని సత్తా చాటింది.

Vijay Antony Bichagadu 2 OTT Rights To Disney Plus Hotstar

అప్పట్లో తెలుగులో థియేట్రికల్ హక్కుకు రూ. 2. 50 కోట్లకు కొనుగోలు చేసిన బయ్యర్ కు సుమారు తెలుగులోనే రూ. 26. 5 కోట్లను అందించిన సినిమా బిచ్చగాడు. ఇక తమిళంలో మాత్రం రూ. 16 కోట్లను వసూలు చేసింది. మరి ఇప్పుడు ఈ బిచ్చగాడు 2 ఎంతవరకు కలెక్షన్స్ తీసుకొస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X