OTT లోకి థియేటర్లో ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ థ్రిల్లర్ మూవీ...స్ట్రీమింగ్ ఎందులో అంటే?
విభిన్న కథా చిత్రాలతో ఎప్పుడు ముందుంటే హీరో.. విజయ్ ఆంటోనీ. ఆయన కేవలం హీరో మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు, సింగర్, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజినీర్, చిత్ర నిర్మాత... ఇలా అన్నిట్లో ఆయనకు ప్రావిణ్యం ఉంది. ఇక తెలుగులో బిచ్చగాడు సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో తాజాగా నటించి చిత్రం హత్య. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసి సందడి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
విజయ్ ఆంటోనీ... ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు... ఆయనలో ఎన్నో ప్రతిభలు దాగి ఉన్నాయి. సంగీత దర్శకుడిగా, సింగర్ గా, సినిమా ఎడిటర్ గా, గేయ రచయితగా, ఆడియో ఇంజినీర్ గా, ప్రొడ్యూసర్ గా... వీటన్నింటిని మించి ఓ మంచి నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో... మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాందించుకున్నారు.

బిచ్చగాడు సినిమా సక్సెస్ తో ఆయన తీసే సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అయ్యేవి. బిచ్చగాడు సినిమాతో బాగా పాపులర్ అయి.. ఆయనకు మంచి క్రేజ్ అయితే తెలుగులో ఏర్పడింది. ఇక ఆయన తీసిన బిచ్చగాడు సినిమాకు ఇటీవల సీక్వెల్ కూడా వచ్చి బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
ఇక విజయ్ ఆంటోనీ తాజాగా నటించిన చిత్రం హత్య. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హత్య సినిమాకు బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు. జూలై 21న రిలీజ్ అయిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికి మంచి కలెక్షన్లను వసూళ్లు చేసింది. విజయ్ ఆంటోనీ డిఫరెంట్ లుక్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విజయ్ ఆంటోనీ నటించిన ఈ హత్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ శుక్రవారం అంటే ఆగస్టు 18 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తమిళ్ వెర్షన్ కొలై మాత్రమే విడుదల చేశారు. తెలుగు వెర్షన్ వచ్చే వారం రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిచ్చగాడు 2 సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.
క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందింది హత్య. ఇక ఈ సినిమాలో వినాయక్ అనే డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ నటించాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కొత్తగా కనిపించాడు విజయ్ ఆంటోనీ. అతడి లుక్‌పై ప్రశంసలు వచ్చినా కథ, కథనాల్లో మాత్రం కొత్తదనం కనిపించక పోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయిందని సినీవిశ్లేషకులు అంటున్నారు. మీరు గనుక క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడితే గనుక.. ఓ సారి ఈ సినిమాను చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











