Raththam OTT: అమెజాన్ ప్రైమ్ లోకి విజయ్ ఆంటోని సినిమా.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బిచ్చగాడు సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గురించి అందరికీ తెలిసిందే. నటనతో అందిరినీ మెప్పించగల సత్తా ఉన్న ఈయన.. తాజాగా హీరోగా చేసిన చిత్రం రత్తం. ది గ్రేట్ డైరెక్టర్ సీఎస్ అముదన్ తెరకెక్కించిన ఈ సినిమాను అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. అయితే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మహిమా నంబియార్, నందితా శ్వేతా, రమ్య నంబీశన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ దారుణ హత్యల కారణంగా రాజకీయ దుమారం చెలరేగుతుంది. అలాగే కొంత మంది మంత్రులు రాజీనామా కూడా చేయాల్సి వస్తుంది. ఆ పరిణామాలన్నింటిని ఈ సినిమాలో చూపించారు. మీడియా, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందోనన్న కాన్సెప్టుతో రూపొందించిన ఈ సినిమాలో విజయ్ భిన్న కోణాలు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. నందితా శ్వేత జర్నలిస్టులో పాత్రలో కనిపించారు.

అయితే ఈ సినిమాను నవంబర్ మూడో తేదీన ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. కేవలం తమిళంలోనే ఈ చిత్రం విడుదల అవుతుందా లేక తెలుగులోనూ వస్తుందా అనే దానిపై స్పష్టత రాలేదు. కానీ సినిమా విడుదల అయి నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలో వస్తుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
రత్తం సినిమాలో రంజిత్ కుమార్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా విజయ్ ఆంటోని కనిపించాడు. గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. మహిమ నంబియార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాధారణ యువతిగా కనిపిస్తూనే ఆమెలోని విలనిజాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మధుమిత అనే జర్నలిస్టుగా నందితా శ్వేత్, చెజియాన్ భార్యగా రమ్య నంబీశన్ కూడా బాగానే నటించింది.

అయితే ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కూతురు చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ.. విజయ్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎవరూ నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ పని చేశాడు. ఆయన తీరు చూసిన అభిమానులు, ప్రజలు అందరూ తెగ మెచ్చుకున్నారు. హీరో అంటే ఇలాగే ఉండాలని చెబుతూ పొగడ్తల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











