నెలకాకముందే OTTలోకి రాబోతున్న విజయ్ ఆంటోని రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

వీకెండ్ వచ్చిందంటే చాలు అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా వస్తూ తెగ సందడి చేస్తున్నారు. కొత్త వారం వచ్చినా, వారం చివరకు వచ్చినా అనేక అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తుండగా.. అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్, ఎండవేడికి బయటకి వెళ్లలేక ఇంట్లోనే కూర్చుని.. హాయిగా సరికొత్త చిత్రాలను చూసేస్తున్నారు. అందుకే సమ్మర్ వచ్చినప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాల హవా పెరిగిపోయింది. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రేజీ చిత్రాలు ఉండగా.. మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన లేసెట్ట్ రొమాంటిక్ కామెడీ మూవీయో "రోమియో". తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రానికి వినాయక్ వైతినాథన్ దర్శకత్వం వహించారు. అయితే ఇదే ఆయనకు డైరెక్టర్ గా తొలి చిత్రం. అయితే ఈ చిత్రాన్ని హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా విజయ్ ఆంటోని నిర్మించారు. విజయ్ ఆంటోని హీరోగా చేసిన ఈ సినిమాలో మిర్నాళిని రవి హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే వీటీవీ గణేష్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్, సుధ, శ్రీజ రవి, షరాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Vijay Antony Recent Romantic Comedy Movie Romeo OTT Streaming Date Fixed Check Details

బరత్ ధనశేఖర్, రవి రాయిస్టర్ లు ఈ సినిమాకు సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా ఫరూక్ జె.భాషా పని చేశారు. అలాగే ఎడిటింగ్ బాధ్యతలను విజయ్ ఆంటోనీయే స్వయంగా చూసుకున్నారు. మలేషియా, బ్యాంకాక్, హైదరాబాద్, బెంగుళూరు, తెన్కాసి, మహాబలిపురంలలో షూటింగ్ జరపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. కానీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన ఆహా తమిళ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. నేరుగా ఆ సంస్థ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. మే 10వ తేదీ నుంచి ఆహా తమిళ్ వేదికగా విజయ్ ఆంటోని రోమియో సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వివరించింది. ఈవిషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ విజయ్ ఆంటోని కోసమైనా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. థియేటర్లలో చూడలేకపోయినా ఓటీటీలో కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Vijay Antony Recent Romantic Comedy Movie Romeo OTT Streaming Date Fixed Check Details

రోమాంటిక్ కపుల్ గా కనిపించబోతున్న విజయ్ ఆంటోని, మిర్నాళిని రవిల ఈ క్రేజీ రొమాంటిక్ చిత్రాన్ని మే 10వ తేదీన ఆహా తమిళంలో కచ్చితంగా చూసేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ ఈ క్రేజీ మూవీని ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X