Bichagadu 2 OTT: ఆ ఓటీటీలోనే బిచ్చగాడు 2.. అప్పటి నుంచే స్ట్రీమింగ్
తమిళంలో రూపొందిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేయడం చాలా కాలం నుంచే వస్తుంది. కానీ, అందులో కొన్ని సినిమాలను మాత్రమే మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాటిలోనూ పలు సినిమాలు కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ వసూళ్లను రాబడుతోన్నాయి. అలాంటి వాటిలో 'బిచ్చగాడు' ఒకటి. విజయ్ ఆంటోనీ నటించిన ఈ చిత్రం అంతటి ప్రభావాన్ని చూపించింది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'ను తీసుకు వచ్చారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైంది.
సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు తెలుగు, తమిళంలో మంచి టాక్ వచ్చింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం రెండు భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. తెలుగులో మాత్రం మరింత ఎక్కువగా లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇలా ఇప్పటికి కూడా కొన్ని ఏరియాల్లో ఈ మూవీ ప్రదర్శన అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిచ్చగాడు 2' ఓటీటీ డేట్‌పై న్యూస్ లీకైంది.

విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ హక్కులన ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతుందని తెలిసింది. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అంటున్నారు. దీంతో థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు.
ఇక, విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.


Click it and Unblock the Notifications











