Bichagadu 2 OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన బిచ్చగాడు 2.. ఆ సీన్స్ కూడా కలిపి మరీ!
ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళంలో బాగా హైలైట్ అయిన చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ, అందులో రెండు మూడు సినిమాలు మాత్రమే మంచి ఆదరణను సొంతం చేసుకుని రెండు భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అందులో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'బిచ్చగాడు 2' ఒకటి. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన 'బిచ్చగాడు' సినిమాకు ఇది సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుని ఈ క్రేజీ మూవీ అత్యధిక థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీపై ఆరంభం నుంచే ఉన్న అంచనాలకు అనుగుణంగా తెలుగు, తమిళంలో మంచి టాక్ వచ్చింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం రెండు భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. తెలుగులో మాత్రం మరింత ఎక్కువగా లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 'బిచ్చగాడు 2' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

విజయ్ ఆంటోనీ హీరోగా, దర్శకుడిగా చేసిన 'బిచ్చగాడు 2' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అయితే, థియేటర్లలో మే 16న విడుదలైన ఈ మూవీని నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తారని అన్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ఇందులో సెన్సార్ అయిన సీన్లను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది.
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2' సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.


Click it and Unblock the Notifications











