ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ మూవీ.. తెలుగు వాళ్లకు మాత్రం చిన్న షాక్

ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళంలో బాగా హైలైట్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ, అందులో కొన్ని సినిమాలు మాత్రం మంచి ఆదరణను సొంతం చేసుకుని రెండు భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ రెండు భాషల్లో సినిమాలు రూపొందించి విడుదల చేస్తున్నారు. అలా ఇటీవలే విడుదలైన సినిమానే 'రోమియో' / 'లవ్ గురు'.

'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2' చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రమే 'రోమియో'. ఈ సినిమా తెలుగులో 'లవ్ గురు' అనే టైటిల్‌తో రూపొందింది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఇది ఏప్రిల్ 11వ తేదీన రెండు భాషల్లో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Vijay Antony Starrer Romeo Movie Streaming Started on Amazon Prime

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ - మృణాళిని రవి కాంబినేషన్‌లో రూపొందిన 'రోమియో' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే తక్కువ స్పందననే సొంతం చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. తద్వారా విజయ్ ఆంటోనీ అభిమానులకు నిరాశే ఎదురైంది.

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 'రోమియో' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు భారీ పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తమిళ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ, తెలుగు హక్కులను ఆహా సొంతం చేసుకున్నాయి. వీటి కోసం ఫ్యాన్సీ రేటును కూడా ముట్టజెప్పాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

Vijay Antony Starrer Romeo Movie Streaming Started on Amazon Prime

'రోమియో' మూవీ తమిళ వెర్షన్‌ను నేటి అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, తెలుగు వెర్షన్ హక్కులను అందుకున్న ఆహా సంస్థ మాత్రం దీనిపై అప్‌డేట్ ఇవ్వలేదు. అంటే.. 'లవ్ గురు' మూవీ ఇంకా స్ట్రీమింగ్‌కు రాలేదు. ఇది తెలుగు ఆడియెన్స్‌కు ఒక రకంగా షాక్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇదిలా ఉండగా.. విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన 'రోమియో' మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మించారు. ఇందులో మృణాళిని రవి హీరోయిన్‌గా నటించగా.. వీటీవీ గణేష్, యోగి బాబు, సుధ, శ్రీజ రవి తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X