Family Star OTT: అనుకున్న తేదీకంటే ముందుగానే OTTలోకి ఫ్యామిలీ స్టార్.. ఎలా చూడొచ్చంటే?
రోజురోజుకూ ఓటీటీల వేదికగా అదిరిపోయే సినిమాలు వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. చిన్నా పెద్దా చిత్రాలు అనే తేడా లేకుండా థియేటర్లలో విడుదల అయి నెల కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సైలెంట్ గా వచ్చేస్తూ చాలా సినిమాలు సర్ ప్రైజ్ చేస్తుంటగా.. మరికొన్ని మాత్రం ముందే అసలు విషయం చెప్పేస్తున్నాయి. అయితే ఇటీవలే విడుదల అయిన ఓ సినిమా మాత్ర ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీ వేదికగా రాబోతున్నట్లు తెలుస్తోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. అయితే కచ్చితంగా ఈసారి హిట్ కొట్టాలని ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాగా.. మొదట్లో బాగానే కలెక్షన్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడు అంతగా దీని హవా కనిపించట్లేదు. అందుకే అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ, ఎపపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమానే ఫ్యామిలీ స్టార్. అయితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ లు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, జగపతి బాబు, వాసుకి, హోరిణి, అభినయ, వెన్నెల కిశోర్, రవి ప్రకాష్, అజయ్ ఘోష్, రవిబాబు, అచ్యుత్ కుమార్, ప్రభాస్ శ్రీను వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా వచ్చి పది రోజులు కూడా కాకముందే.. థియేటర్ల వద్ద చతికిలపడిపోయింది. అందుకే అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను దక్కించుకుంది.

అయితే థియేటర్లలో విడుదల అయిన 45 రోజుల తర్వాత ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నారట. కానీ అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. చూడాలి మరి ఎప్పుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారనేది.


Click it and Unblock the Notifications











