Family Star OTT Rights: విజయ్ దేవరకొండ మూవీకి ఫ్యాన్సీ రేట్.. ప్రముఖ ఓటీటీకి ఫ్యామిలీ స్టార్ రైట్స్!
ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద చిత్రాలు అయినా సరే నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న హీరోలు, పెద్ద హీరోలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. నెల తిరక్కుండానే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. అయితే కచ్చితంగా నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని భావించిన ఈయన ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తున్నాడు.
పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమానే ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ థాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందే ఓటీటీ హక్కులను భారీ ధరకు ఓ సంస్థ కొనుగోలు చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ కనిపించడంతో... హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందనే నమ్మకంతో ఉన్నారు. అలాగే సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు, టీజర్ లు కూడా అదిరిపోగా అంతా తెగ్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలోని ఐరనే వంచాలా ఏంటి, నందనందనా సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేశాయి. అందరికీ చిత్రంపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. అలాగే రౌడీ బాయ్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించడం.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే హీరోయిన్ ను కాలేజీ వద్ద దింపుతానని చెప్పడం కూడా బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

అయితే సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా ఓటీటీ వేదికగా.. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత రాబోతుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ సినిమా పెద్ద ఎత్తున హిట్ కొట్టలేక, వసూళ్లు రాబట్టుకోలేక పోతే మాత్రం నెల రోజుల్లోపే వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ఏ రేంజ్ లో ప్రభంజన సృష్టిస్తుంది... ఎంతమేర కలెక్షన్లు రాబట్టుకుని.. ఎప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందనేది.


Click it and Unblock the Notifications











