DANCE IKON: కష్టాల్లో ఉన్న డ్యాన్సర్ కోసం విజయ్ సాయం.. ఏం కావాలన్నా తీసుకో అంటూ...

కేవలం స్టార్ హీరో గానే కాకుండా విజయ్ దేవరకొండ ఎన్నో మంచి సేవ కార్యక్రమాలతో కూడా జనాలకు చాలా దగ్గరయ్యాడు. కరోనా కష్టకాలంలో కూడా అతను చాలామందికి హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాల బాధను తెలిసిన వాడిని అని ఎంతోమందికి రేషన్ అందించే ప్రయత్నం చేశాడు. అయితే రీసెంట్ గా అతను డాన్స్ ఐకాన్ షోలో కూడా స్పందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఒక పేద కళాకారుడికి విజయ్ ఇచ్చిన ఆఫర్ అద్భుతమని అతని అభిమానులు కొనియాడుతున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే...

డ్యాన్స్ ఐకాన్ షోలో

డ్యాన్స్ ఐకాన్ షోలో

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా లైగర్ సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి గ్యాప్ లేకుండా వీలైనంతవరకు ఎక్కువగా రియాలిటీ షోల ద్వారా కూడా లైగర్ సినిమాను ప్రమోట్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆహా ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షోలో కూడా విజయ్ హీరోయిన్ తో కలిసి పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన స్పెషల్ ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రత్యేక ఆకర్షణగా..

ప్రత్యేక ఆకర్షణగా..

ఈ స్పెషల్ డాన్స్ షోకు ఓంకార్ హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇదివరకే ఆహా నుంచి వచ్చిన సూపర్ సింగర్ షో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ షో తో కూడా ఆకట్టుకోవాలి అని ఈ ఓటీటీ సంస్థ మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాంకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ షోకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అందులో కొంతమంది డాన్స్ చేసి విజయ్ ఆశ్చర్యపోయాడు. మీలాంటి వాళ్లతో చేస్తే మమ్మల్ని ఎవరూ చూడరు అని కూడా స్పందించడం విశేషం.

విజయ్ ఎమోషనల్

అయితే విజయ్ ఒక ఒక డాన్సర్ పరిస్థితి గురించి తెలుసుకొని షాక్ అయ్యాడు. ఆనంద్ అనే ఒక డాన్సర్ ఎంతో అద్భుతంగా తల్లి పై ప్రేమను చూపించే విధంగా డాన్స్ చేశాడు. అతని డాన్స్ కు అందరూ కూడా ఫిదా అయ్యారు. అయితే ఓంకార్ అతని పరిస్థితి గురించి తెలియజేశాడు. అతని తల్లికి క్యాన్సర్ ఉంది అని కనీసం బట్టలు కొనుక్కోడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో విజయ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.

విజయ్ ఆఫర్

విజయ్ ఆఫర్

అంతేకాకుండా విజయ్ దేవరకొండ గతంలో తన ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను గురించి కూడా తెలియజేశాడు. ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు బట్టలు లేకపోతే ప్రొడక్షన్ వల్లను అడిగి సినిమా కాస్ట్యూమ్స్ వేసుకున్నట్లుగా తెలియజేశాడు.

అయితే ఆనంద్ అనే డాన్సర్ పరిస్థితి తెలుసుకున్న తర్వాత రౌడీ వేర్ నుంచి నీకు ఏది కావాలి అంటే ఆ కాస్ట్యూమ్ తీసుకో అని ఆఫర్ ఇచ్చాడు. డాన్స్ కు తగ్గట్టుగా నువ్వు రౌడీ బ్రాండ్ నుంచి బట్టలు తీసుకోవచ్చు అని చెప్పడంతో అతను చాలా ఆనందపడ్డాడు. ఇక విజయ్ తీసుకున్న నిర్ణయంపై మిగతా పోటీదారులు అలాగే జడ్జిలు కూడా హర్షం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X