Liger OTT రిలీజ్ డేట్.. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ లైగర్ ఆగస్టులో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది. ఇక ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు కన్ఫ్యూజాన్ కి గురి చేశాయి. ఇక మొత్తానికి లైగర్ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పుడు విడుదల కాబోతోంది ఏ ఫ్లాఠీ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

విజయ్ హార్డ్ వర్క్

విజయ్ హార్డ్ వర్క్

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని సిద్ధం చేసుకున్న లైగర్ కథ వినగానే విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మధ్యలో కొన్ని మార్పులు కూడా చేశారు. ఇక ఈ సినిమా కథ వినగానే విజయ్ తన కెరీర్ లో మొదటిసారి ఫిట్నెస్ విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. బాక్సింగ్ పాత్ర కావడంతో అందుకు తగ్గట్టుగా శిక్షణ కూడా తీసుకున్నాడు.

పాన్ ఇండియా విడుదల

పాన్ ఇండియా విడుదల

ఇక ఎంతోకాలంగా ఫ్యాన్స్ ను ఊరించిన లైగర్ సినిమా మొత్తానికి ఆగస్టు 25వ తేదీన గ్రాండ్గా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదలైంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదలైంది.

 ఆల్ ఇండియా ప్రమోషన్స్

ఆల్ ఇండియా ప్రమోషన్స్

విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా కష్టపడ్డాడు అనే చెప్పాలి. ఇప్పుడు తిరగని ప్రదేశాలకు కూడా వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు. ముఖ్యంగా తమిళ్ కన్నడ మలయాళం చిత్ర పరిశ్రమలకు కూడా వెళ్లిన విజయ్ అక్కడ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాడు. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

 ఆ సంస్థకు ఓటీటీ హక్కులు

ఆ సంస్థకు ఓటీటీ హక్కులు

బాక్సాఫీస్ వద్ద దారుణంగా నష్టాలను కలిగించిన ఈ సినిమా ఓటీటీలో కాస్త ముందుగానే రాబోతున్నట్లు ఇంతకుముందే చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి మార్పు లేకుండానే ఈ సినిమాను ఓటీటీ డీల్ కు తగ్గట్టుగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను మొదట నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ పోటీ పడినప్పటికీ భారీగా ఆఫర్ చేయడంతో హాట్ స్టార్ కు ఈ సినిమా హక్కులను అమ్మేశారు.

రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక ఫైనల్ గా లైగర్ సినిమా హాట్ స్టార్ లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో మరొక న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో మైక్ టైసన్ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X