FAMILY STAR OTT: ఫేమస్ ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. ఎన్ని రోజులకు వస్తుందంటే

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయం అయినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన చిత్రాలతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి తన మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య వరుసగా పరాజయాలను చవి చూస్తూ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇప్పుడు హిట్ కొట్టాలని 'ఫ్యామిలీ స్టార్' చేశాడు.

క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల తెరకెక్కించిన చిత్రమే 'ఫ్యామిలీ స్టార్'. పొదుపు చేసే హీరోకు పెళ్లి చేసుకోవడం వల్ల భిన్నమైన పరిస్థితులు ఎదురు కావడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించారు. ఇలా ఈ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసేశారు.

Vijay Devarakonda Starrer FAMILY STAR Movie Digital Streaming Details

విజయ్ దేవరకొండ హీరోగా 'ఫ్యామిలీ స్టార్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గత రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. బుకింగ్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చేశాయి.

'ఫ్యామిలీ స్టార్' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ రేటునే చెల్లించినట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda Starrer FAMILY STAR Movie Digital Streaming Details

క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం మే రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X