ముందుగానే ఓటీటీలోకి ది ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడు, ఎందులో వస్తుందంటే!

ఈ దశాబ్ద కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే హిట్లు కొట్టి సత్తా చాటిన అతడు.. ఇప్పుడు ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో హిట్ కోసం ఇప్పుడు 'ది ఫ్యామిలీ స్టార్' చేశాడు.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల తీసిన సినిమానే 'ది ఫ్యామిలీ స్టార్'. పూర్తి స్థాయి కుటుంబ విలువలతో కూడిన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగానే 'ది ఫ్యామిలీ స్టార్' మూవీని ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie Digital Streaming Starts Before 30 Days

క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన ఆశించిన రీతిలో రావడం లేదు. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు చాలా తక్కువగానే వస్తున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ సినిమా టార్గెట్‌ను చేరడం చాలా కష్టంగా మారింది.

ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ లీక్ అయింది.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie Digital Streaming Starts Before 30 Days

విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 30 రోజుల లోపే ఓటీటీలోకి తీసుకు వస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్‌లో రూపొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్' చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X