నెల కాకుండానే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. వాళ్లకు మాత్రమే బంపర్ ఆఫర్
టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే తనదైన చిత్రాలతో రేంజ్‌ను పెంచుకున్న ఈ కుర్రాడు.. ఈ మధ్య కాలంలో మాత్రం హిట్లను అందుకోవడం లేదు. దీంతో ఈ సారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ చేశాడు.
క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల తెరకెక్కించిన సినిమానే 'ది ఫ్యామిలీ స్టార్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే 'ది ఫ్యామిలీ స్టార్' మూవీని ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్‌లో రూపొందిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన ఆశించిన రీతిలో దక్కలేదు. ఫలితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అనుకున్న విధంగా రాలేదు. ఆ తర్వాత కూడా వసూళ్లు చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ సినిమా టార్గెట్‌ను చేరకుండానే రన్ ముగించేసింది.
భారీ హైప్‌తో రూపొందిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై అమెజాన్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాను 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే దీన్ని మే 3న తీసుకు వస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే, అంచనాలు తలకిందులు చేస్తూ దీన్ని ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. అంతేకాదు, మొదట ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ చేసి.. తర్వాత మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ తీసుకు వస్తారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కలయికలో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మ్యాన్' చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











