twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Koffee With Karan 7 ప్రియురాలిని చేయ్యెత్తి కొట్టాల్సి వస్తే.. హృదయాలను గెలుచుకొన్న విజయ్ దేవరకొండ సమాధానం

    |

    లైగర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తూ బీజీగా ఉన్నారు. అయితే తాజాగా దర్శక, నిర్మాత, కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలకు విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అర్జున్ రెడ్డి సినిమా, తన వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలను వెల్లడిస్తూ తాను మహిళల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించను అని స్పష్టం చేశారు. కాఫీ విత్ కరణ్ 7 షోలో విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానాలు ఏమిటంటే..

    అర్జున్ రెడ్డి పాత్రను అందుకే చేశా

    అర్జున్ రెడ్డి పాత్రను అందుకే చేశా

    నిజ జీవితంలో అర్జున్ రెడ్డిలా ఉంటారా? అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను యాక్టర్‌ను. ఏ సినిమాలోనైనా నేను క్యారెక్టర్‌‌ను అర్ధం చేసుకొంటాను. ఆ పాత్ర మంచిదా? చెడ్డదా అనే విషయంపై దృష్టిపెట్టను. ఒకవేళ క్యారెక్టర్‌ గురించి ఆలోచిస్తే.. నేను నటించను. ఎవరైనా నా ముందుకు ఒక క్యారెక్టర్‌ను తీసుకొస్తే.. దాని గురించి మాత్రమే ఆలోచించిస్తాను. నా మనసుకు నచ్చితే ఆ పాత్రను చేయడానికి ఇష్టపడుతాను. లేకపోతే ఆ పాత్రను చేయడానికి నిరాకరిస్తాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

     నేను స్త్రీ ద్వేషిని కాదు..

    నేను స్త్రీ ద్వేషిని కాదు..


    అర్జున్ రెడ్డి చిత్రంలో ఆ పాత్ర తీరును ఇష్టపడ్డాను. అందుకే ఆ సినిమా చేశాను. ప్రీతితో రిలేషన్‌షిప్‌లో అతడు ఎందుకు అలా చేశాడనే విషయాన్ని అర్ధం చేసుకొన్నాను. అర్జున్ రెడ్డి పాత్రను పోషించినంత మాత్రన నేను స్త్రీ ద్వేషిని కాదు. ఫెమినిజానికి వ్యతిరేకం కాదు. అర్జున్ రెడ్డి చిత్రంలో రెండు పాత్రల మధ్య విభిన్నమైన ప్రేమ కథను నేను ఇష్టడ్డాను. ఒకవేళ నేను ఏ అమ్మాయిపై చేయి చేసుకోవాల్సి వస్తే.. నేను అక్కడి నుంచి వెళ్లిపోతాను. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రేమికులిద్దరూ హ్యాపీగా కలిసిపోయి పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కూడా కంటారు అని విజయ్ దేవరకొండ తెలిపారు.

    స్క్రీన్ మీద ఆ బాధను తట్టుకోలేరు

    స్క్రీన్ మీద ఆ బాధను తట్టుకోలేరు


    అర్జున్ రెడ్డి సినిమాను కొందరు వ్యతిరేకించే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లు తమ రిలేషన్‌షిప్‌ బ్రేకప్ అయి, లేదా చేదు అనుభవాన్ని పొందిన వారు ఆ సినిమాను వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. అలాంటి బాధను తెరమీద భరించలేరు. ఓ మహిళ, భార్యకు, ప్రియురాలి బాధను స్క్రీన్ మీద చూసి తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది అని విజయ్ దేవరకొండ అన్నారు.

    ఏ అమ్మాయిపై చేయి చేసుకోలేదు

    ఏ అమ్మాయిపై చేయి చేసుకోలేదు


    అర్జున్ రెడ్డి మాదిరిగా నేను నా జీవితంలో ఏ అమ్మాయిపై చేయి చేసుకోలేదు. భవిష్యత్‌లో అలాంటి పని చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే నేను అక్కడి నుంచి వెళ్లిపోతాను. అమ్మాయిలతో చెడుగా ప్రవర్తించే ఛాన్స్ ఉండదు. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే.. మెల్లగా అక్కడి నుంచి జారుకోవడం మేలు అని విజయ్ దేవరకొండ చెప్పారు.

    25వ తేదీన లైగర్ మూవీ

    25వ తేదీన లైగర్ మూవీ


    ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రంలో అనన్యపాండేతో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఇటీవల రిలీజైన టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

    English summary
    Actor Vijay Deverakonda becomes emotional over Women in Karan Johar's Koffee with Karan 7 with Ananya Panday. Vijay Said, He is not anti faminist.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X