భారీ ధరకు కింగ్డమ్ ఓటీటీ రైట్స్.. విజయ్ దేవరకొండ మూవీకి ఎన్ని కోట్లో తెలుసా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే చిత్రం కింగ్డమ్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. విజయ్ దేవరకొండ తో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ లెవల్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో కింగ్డమ్ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక కింగ్డమ్ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే అయ్యిందని తెలుస్తోంది. మరోవైపు ఓటీటీ హక్కులకు కూడా భారీ ధర పలుకుతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో కింగ్డమ్..
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తొలిసారిగా విజయ్ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ లో నటించారు. దీంతో విజయ్ దేవరకొండ కొత్తగా తెరపై కనిపిస్తారని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫర్ సినిమా బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నటీనటులు, టాప్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానికి రూ.150 కోట్లు ఖర్చైందని మేకర్స్ వెల్లడించడం విశేషం.

Vijay Deverakonda Kingdom Movie OTT Rights Price

కింగ్డమ్ ఓటీటీ హక్కులకు భారీ ధర..
సాధారణంగానే విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి హైప్ ఉంటుంది. కాస్తా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందనేది ట్రేడ్ నిపుణుల మాట. ఈ క్రమంలో కింగ్డమ్ చిత్రంలో విజయ్ లుక్, ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. మరోవైపు జెర్సీ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే ఓటీటీ హక్కులకు భారీ ధర పలుకుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కోసం కింగ్డమ్ చిత్రం మేకర్స్ తో 50 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది.

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం తెలుగు తోపాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం జూలై 31న రిలీజ్ అవుతోంది. దీంతో ఇప్పటికే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు తెలుగు స్టేట్స్ లో మాత్రం రూ.36 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అడ్వాన్స్ సేల్స్ లోనూ కింగ్డమ్ దూకుడుగానే ఉంది. తొలిరోజే 30 వేల టికెట్స్ అమ్ముడుకోవడం విశేషం.

కింగ్డమ్ సినిమా వివరాలు..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా కింగ్డమ్ చిత్రం రూపుదిద్దుకుంది. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. జోమోన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటో గ్రాఫర్లుగా పనిచేశారు. నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: vijay deverakonda Kingdom netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X