OTT లోకి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఇక లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్.. శాకుంతలం సినిమా తర్వాత సమంత చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాబట్టడంతో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ కు సిద్ధం అయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు విక్రయించింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు, ఎక్కడ రానుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖుషి సినిమాను నిర్మించారు.

ఖుషి సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకోవడంతో.. భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా 54 కోట్ల రూపాయలు బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాలో విజయ్, సమంతల కెమిస్ట్రీ వర్కవుట్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా మౌత్ టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది.
శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్ కేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక విడుదలై 16 రోజులు అయినప్పటికీ... ఇప్పటికీ అక్కడక్కడా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతోంది.

మరోవైపు ఖుషి సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని విజయ్, సామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. విజయ్, సామ్‌ల సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు విక్రయించింది. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా అక్టోబర్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందంట. త్వరలోనే ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఇక ఖుషి సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాష ల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. కాబట్టి ఓటీటీలో కూడా ఈ భాషల్లోనే రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. తమిళ నాడులోనూ ఖుషి సినిమా రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇక థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











