Kushi OTT: ఫేమస్ ఓటీటీలో ఖుషి మూవీ.. విజయ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తనదైన నటన, బాడీ లాంగ్వేజ్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్లు రావడంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అలాంటిది ఈ మధ్య కాలంలో ఈ యంగ్ హీరోకు వరుసగా పరాజయాలే ఎదురు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న లక్ష్యంతో విజయ్ దేవరకొండ 'ఖుషి' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీలో నటించాడు.
విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమే 'ఖుషి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఖుషి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 1న విడుదలైన 'ఖుషి' మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











