Kushi OTT: అప్పుడే ఖుషి ఓటీటీ డేట్ ఫిక్స్.. విజయ్ మూవీకి దెబ్బ పడుతుందా?
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. హీరోగా కెరీర్‌ను మొదలెట్టిన కొత్తలోనే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో ప్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని 'ఖుషి' మూవీ చేశాడు.
విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమే 'ఖుషి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కింది. ఫలితంగా ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది తేలిపోయింది. ఫలితంగా కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్‌కు ఇది చాలా దూరంలో ఉంది.

క్రేజీ కాంబినేషణ్‌లో ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఖుషి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.
ఫిలిం నగర్ ఏరియాలోని సినీ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఖుషి' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 1న విడుదలైన 'ఖుషి' మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని ఇటీవలే సమాచారం బయటకు వచ్చేసింది.

ఫిలిం సర్కిళ్లలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారమే 'ఖుషి' మూవీని అక్టోబర్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతుందని అంటున్నారు. ఇలా ఈ డేట్ ముందే బయటకు రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ఇప్పుడు ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











